Anushka Shetty in Kalki 2: ప్రభాస్(Rebel Star Prabhas), నాగ అశ్విన్(Nag Ashwin) కాంబినేషన్ లో తెరకెక్కిన సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ కల్కి(Kalki 2898 AD) సీక్వెల్ కి సంబంధించిన షూటింగ్ వచ్చే ఏడాది ప్రారంభం నుండి మొదలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు మేకర్స్. అందుకే ఇప్పటి నుండే ఆర్టిస్టులను డేట్స్ కోసం సంప్రదించడం మొదలు పెట్టారు. అందులో భాగంగా దీపికా పదుకొనే(Deepika padukone) ని సంప్రదించగా, ఆమె డిమాండ్స్ ని చూసి షాక్ అయిన నిర్మాతలు వెంటనే ఆమెని సినిమా నుండి తప్పించారు. ఈ సందర్భంగా రెండు రోజుల క్రితమే ఈ విషయాన్నీ తెలుపుతూ మేకర్స్ ట్విట్టర్ లో ఒక ట్వీట్ వెయ్యగా అది సంచలనంగా మారింది. దీనిపై సోషల్ మీడియా లో ఇప్పటికీ చర్చలు నడుస్తూనే ఉన్నాయి. ఈ విషయం పక్కన పెడితే ఇప్పుడు దీపికా పదుకొనే ఈ సినిమా నుండి తప్పుకుంది కాబట్టి, ఇప్పుడు ఆమె స్థానం లోకి ఎవరిని తీసుకోబోతున్నారు అనే దానిపై పెద్ద చర్చనే నడుస్తుంది.
అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఇప్పుడు మేకర్స్ అనుష్క శెట్టి ని సంప్రదిస్తున్నట్టు తెలుస్తుంది. ముందుగా అలియా భట్, కృతి సనన్ పేర్లు అనుకున్నారు కానీ, వాళ్ళకంటే ఎక్కువగా అనుష్క శెట్టి(Anushka shetty) ఈ పాత్రకు న్యాయం చేయగలదని, కాబట్టి ఆమె అయితేనే బాగుంటుందని మేకర్స్ ఆమె డేట్స్ కోసం ప్రయత్నం చేస్తున్నారట. గతం లో ప్రభాస్ అనుష్క కాంబినేషన్ లో బాహుబలి 1 , బాహుబలి 2 , మిర్చి సినిమాలు వచ్చాయి. ఈ మూడు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టించిన కలెక్షన్ల సునామి ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మళ్లీ వీళ్ళ కాంబినేషన్ లో క్రేజీ బ్లాక్ బస్టర్ కి సీక్వెల్ అంటే కచ్చితంగా క్రేజ్ వేరే లెవెల్ లో కలిసొస్తుందని, అందుకే ఈ కాంబినేషన్ ని సెట్ చేసే పనిలో మేకర్స్ ఉన్నారని అంటున్నారు.
రీసెంట్ గానే అనుష్క ఘాటీ చిత్రం తో భారీ ఫ్లాప్ ని ఎదురుకుంది. ఆమె కం బ్యాక్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. ప్రభాస్ ఎలాగో ఆమెకు మంచి సన్నిహితుడు కాబట్టి, కచ్చితంగా అనుష్క ఈ చిత్రం ఒప్పుకొని చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే పార్ట్ 2 కి సంబందించి ఇప్పటికే దీపికా పదుకొనే పై కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారట. ఇప్పుడు ఆ సన్నివేశాలను అనుష్క తో రీ షూట్ చేయాల్సి ఉంటుంది. నిర్మాతకు అదనపు బడ్జెట్ భారీగా అవుతుంది. అందుకేనేమో సోషల్ మీడియా లో అంత బహిర్గతంగా దీపికా పదుకొనే పై మూవీ టీం ఫైర్ అయ్యింది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు. ఇకపోతే ప్రభాస్ ప్రస్తుతం తన ద్రుష్టి మొత్తాన్ని రాజా సాబ్ షూటింగ్ ని పూర్తి చేయడం కోసమే పెట్టాడు. ఈ సినిమా తర్వాత వెంటనే ఆయన ‘స్పిరిట్’ చిత్రం లో నటించబోతున్నాడు. ఈ రెండిటి తర్వాత కల్కి సీక్వెల్ మొదలయ్యే అవకాశం ఉంది.