
Pavitra Lokesh- Naresh: నరేష్-పవిత్ర లోకేష్ ల వివాదాల డ్రామాకు ఇప్పట్లో తెరపడే సూచనలు కనిపించడం లేదు. ఏడాది కాలంగా ఏదో ఒక రూపంలో వీరి గొడవ తెరపైకి వస్తుంది. ఇటీవల మూడో భార్య రమ్య రఘుపతి రచ్చ చేసిపోయారు. నరేష్ మీద దారుణమైన ఆరోపణలు చేశారు. నరేష్ ఒక ఉమనైజర్. నీలి చిత్రాలు చూస్తాడు. పలుమార్లు ఇతర మహిళలతో పట్టుబడ్డాడు. నరేష్ వ్యవహారాలు తల్లి విజయనిర్మలకు కూడా తెలుసు. ఎప్పటికైనా మారతాడని నాకు నచ్చజెప్పేది. ఆమె మరణించాక చెప్పేవాళ్ళు లేకుండా పోయారు. నరేష్ నాకు ఎఫైర్స్ అంటగట్టారు. చివరికి దేవుడు లాంటి కృష్ణతో కూడా ఎఫైర్ పెట్టుకున్నానని నిందలు వేశాడు . నన్ను వదిలించుకోవడానికి దారుణాలకు పాల్పడ్డాడని సంచలన విమర్శలు గుప్పించారు.
రమ్య రఘుపతి ఆరోపణలపై కొద్దిరోజులు సైలెంట్ గా ఉన్న నరేష్… ప్రెస్ మీట్ పెట్టాడు. రమ్య రఘుపతి మీద ప్రతి విమర్శలు చేశారు. ఆమె తాగుబోతు, తిరుగుబోతు. కేవలం ఆస్తి కోసమే నాతో సంసారం చేసింది. పిల్లల్ని కంది. ఫోన్ ట్యాప్ చేసి బ్లాక్ మెయిలింగ్ మెటీరియల్ సిద్ధం చేసింది. చంపేందుకు రౌడీ షీటర్ తో రెక్కీ నిర్వహించింది. వ్యాపారాలు అంటూ డబ్బులు నాశనం చేసింది. ఆమె మీద కుటుంబ సభ్యులు, మిత్రులకు కూడా మంచి అభిప్రాయం లేదంటూ సంచలన ఆరోపణలు చేశారు.
నరేష్ ప్రెస్ మీట్ తర్వాత రమ్య రఘుపతి స్పందించకపోవడం విశేషం. ఐతే నరేష్ కి విడాకులు మాత్రం ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. మరోవైపు పవిత్రతో తన రిలేషన్ పై తప్పుడు రాతలు రాస్తున్నారు. మార్ఫింగ్ ఫోటోలు వైరల్ చేస్తున్నారంటూ నరేష్ సైబర్ క్రైమ్ పోలీసులను సంప్రదించారు. ఆధారాలతో సహా కొన్ని యూట్యూబ్ అండ్ మీడియా సంస్థలపై ఫిర్యాదు చేశారు. తమపై ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని వెల్లడించారు. నరేష్ ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు.

గతంలో కూడా నరేష్-పవిత్ర కొన్ని మీడియా సంస్థలు మీద ఫిర్యాదు చేయడం జరిగింది. దాదాపు 15 యూట్యూబ్ ఛానల్స్ కి నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. ఈ తప్పుడు ప్రచారం వెనుక కూడా రమ్య రఘుపతి హస్తం ఉందని నరేష్ ఆరోపించడం విశేషం. కాగా 2022 డిసెంబర్ 31న తేదీన నరేష్ నాలుగో పెళ్లి ప్రకటన చేశారు. పవిత్ర లోకేష్ ని వివాహం చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియా ప్రకటన చేశాడు. అలాగే పవిత్రను కిస్ చేస్తూ ఒక రొమాంటిక్ వీడియో షేర్ చేశారు. దాదాపు నాలుగేళ్లుగా నరేష్-పవిత్ర లోకేష్ సహజీవనం చేస్తున్నారు.