Ram Charan : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘గేమ్ చేంజర్’ చిత్రం వచ్చే నెల 10 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా తెలుగు, హిందీ,తమిళ భాషల్లో గ్రాండ్ గా విడుదల అవ్వబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన టీజర్, సాంగ్స్ కి ఫ్యాన్స్, ఆడియన్స్ నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. ఈ నెల 21వ తారీఖు నుండి మూవీ ప్రొమోషన్స్ భారీ రేంజ్ లో మొదలు కాబోతుంది. దేశం లోనే మొట్టమొదటిసారిగా అమెరికా లోని డల్లాస్ ప్రాంతంలో ఈ నెల 21న ప్రీ రిలీజ్ ఈవెంట్ ని జరుపుకోబోతున్న మొట్టమొదటి ఇండియన్ చిత్రం గా ‘గేమ్ చేంజర్’ సరికొత్త చరిత్ర సృష్టించబోతోంది. ఆ తర్వాత ఇండియా కి వచ్చాక ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అన్ని రాష్ట్రాల్లోనూ గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. అయితే ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ఓవర్సీస్ లో ఇటీవలే ప్రారంభమైంది.
నార్త్ అమెరికా లో మూడు రోజుల క్రితం అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు పెట్టగా, వెయ్యి షోస్ నుండి 2 లక్షల 50 వేల డాలర్స్ గ్రాస్ వసూళ్లు వచ్చినట్టు చెప్తున్నారు ట్రేడ్ పండితులు. ప్రస్తుతం కల్కి, సలార్, దేవర, పుష్ప 2 రేంజ్ లోనే అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతున్నట్టు అక్కడి ట్రేడ్ పండితులు చెప్తున్నారు. ఇదే రేంజ్ ఊపుని కొనసాగిస్తూ ముందుకు పోతే కచ్చితంగా ఈ చిత్రం నార్త్ అమెరికా లో ప్రీమియర్ షోస్ నుండి 3 మిలియన్ డాలర్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబడుతుందని బలమైన నమ్మకంతో ఉన్నారు ఫ్యాన్స్. నిన్నటి నుండి తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉండే నార్త్ అమెరికా రాష్ట్రాల్లో XD షోస్ ని షెడ్యూల్ చేస్తూ వెళ్తున్నారు మేకర్స్. XD షోస్ కి అక్కడ ఉండే మన ఆడియన్స్ ఎక్కువగా ఆసక్తి చూపిస్తారట. ఆ షోస్ నుండి ఈ సినిమాకి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుందని అంటున్నారు.
ఈ చిత్రం ఆల్ టైం రికార్డు ప్రీమియర్స్ ని రాబట్టాలంటే నాలుగు మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు నార్త్ అమెరికా నుండి రాబట్టాలి. కల్కి చిత్రానికి 3.9 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు ప్రీమియర్ షోస్ నుండి వచ్చాయి. ప్రస్తుతానికి అయితే ఓవర్సీస్ లోని అన్ని దేశాలకు కలిపి 3 లక్షల 50 వేల డాలర్లు వచ్చినట్టు చెప్తున్నారు ట్రేడ్ పండితులు. 21 వ తేదీన రామ్ చరణ్ నార్త్ అమెరికా లో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొని వెళ్లిన తర్వాత గ్రాస్ వసూళ్లు ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు ట్రేడ్. చూడాలి మరి ఈ చిత్రం ఓవర్సీస్ లో ప్రీమియర్స్+ మొదటి రోజు కలిపి కల్కి, పుష్ప 2 గ్రాస్ వసూళ్లను దాటుతుండగా లేదా అనేది. ఈ రెండు చిత్రాలకు హిందీ వెర్షన్ వసూళ్లు కూడా తోడయ్యాయి. ఆ రెండు చిత్రాలతో పోలిస్తే ‘గేమ్ చేంజర్’ చిత్రానికి హిందీ వెర్షన్ వసూళ్లు తక్కువ ఉండొచ్చు.