Adivi Sesh- Mahesh Babu: అడవి శేష్ హీరో గా నటించిన ‘హిట్ 2 ‘ చిత్రం నిన్న విడుదలై సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకొని అద్భుతమైన వసూళ్లను రాబడుతున్న సంగతి తెలిసిందే..అడవి శేష్ కి హీరో గా తన మార్కెట్ ని మరింత పెంచింది ఈ చిత్రం..హిట్ సినిమాకి సీక్వెల్ గా వచ్చిన ఈ చిత్రానికి కూడా న్యాచురల్ స్టార్ నాని నిర్మాతగా వ్యవహరించాడు..త్వరలోనే ‘హిట్ 3 ‘ కూడా తెరకెక్కబోతుంది..ఇందులో నాని హీరో గా నటించబోతున్నాడు..ఇక సినిమా సూపర్ హిట్ అయిన ఆనందం లో అభిమానులతో కాసేపు ఇంటరాక్ట్ అయ్యేందుకు అడవి శేష్ ట్విట్టర్ లో ‘#AskSesh’ అనే కార్యక్రమం ని నిర్వహించాడు.

ఇందులో అభిమానులు అడిగిన ప్రశ్నలన్నిటికీ చాలా ఓపికగా సమాధానం చెప్పాడు అడవి శేష్..ముఖ్యంగా సూపర్ స్టార్ మహేష్ బాబు తో తనకి ఉన్న అనుభందం గురించి అడవి శేష్ అభిమానులతో పంచుకున్నాడు..ఆయన చెప్పిన ఆ మాటలు వింటే మహేష్ బాబు ఎంత గొప్పవాడో అర్థం అవుతుంది.
ఒక మహేష్ అభిమాని అడవి శేష్ కి ట్వీట్ చేస్తూ ‘మీ హిట్ యూనివర్స్ లో మహేష్ అన్న ని కూడా చేర్చండి..వేరే లెవెల్ కి వెళ్ళిపోతుంది’ అని అంటాడు..అప్పుడు అడవి శేష్ దానికి సమాధానం చెప్తూ ‘ఏమో నాకు తెలీదు..అంత పెద్ద స్టార్ కి అన్ని సూట్ అవుతుందో లేదో చూసుకోవాలి కదా..కానీ మహేష్ సార్ ఈరోజు ఉదయం నాకు ఫోన్ చేసారు..చాలా సేపటి వరుకు నాతో మాట్లాడాడు..ఆయన నన్ను చూసి ఎంత గర్వపడుతున్నాడో చెప్పాడు.

అవన్నీ విని నా కళ్ళలో నీళ్లు తిరిగాయి..ఒక తమ్ముడిగా ఎలాంటి కష్టసమయంలో అయినా తోడు ఉంటాను అని మహేష్ సార్ కి మాట ఇచ్చాను..ఆయనకీ హిట్ 2 ఎప్పుడెప్పుడు చూపిస్తాను అని ఆత్రుతతో ఎదురు చూస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు అడవి శేష్..తండ్రి చనిపోయిన బాధలో ఉన్నప్పటికీ మహేష్ కొత్త టాలెంట్ ని ప్రోత్సహించడం లో ముందు ఉన్నదంటే ఆయన గొప్ప మనసు ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.