Adivi Sesh- Supriya: సినిమా ఇండస్ట్రీ అంటేనే గాసిప్స్ కి పుట్టినిల్లు లాంటిది..ఒక హీరో హీరోయిన్ కలిసి వరుసగా రెండు మూడు సినిమాలు చేసిన, వాళ్ళు స్నేహం గా ఉన్నా..ఆన్ స్క్రీన్ పై వాళ్ళిద్దరి కెమిస్ట్రీ అదిరినా కచ్చితంగా వీళ్లిద్దరి మధ్య ఎదో ఉందని పుకార్లు పుట్టించేస్తారు గాసిప్ రాయుళ్లు..సోషల్ మీడియా అభివృద్ధి చెందని రోజుల నుండి ఇది ఇండస్ట్రీ లో ఉన్న సెలబ్రిటీస్ కి అనుభవం అవ్వడం సర్వసాధారణం అయిపోయింది..కానీ సోషల్ మీడియా వృద్ధిలోకి వచ్చిన తర్వాత ఇలాంటి గాసిప్స్ కి అడ్డుఅదుపు లేకుండా పోయింది..ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీ లో నిలదొక్కుకుంటూ వస్తున్నా ప్రముఖ యంగ్ హీరో అడవి శేష్ పై కూడా ఇలాంటి రూమర్స్ ప్రారంభం అయ్యాయి..తన పని తానూ చేసుకుంటూ రూమర్స్ కి ఎప్పుడు దూరంగా ఉండే అడవి శేష్ పై ప్రచారమైన ఆ రూమర్ ఏమిటి..ఇండస్ట్రీ లో ఎవరితో ఆయన క్లోజ్ గా ఉండడం వల్ల ఇలాంటి రూమర్స్ పుట్టాయి అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాము.

ఇక అసలు విషయానికి వస్తే అక్కినేని నాగార్జున గారి కోడలు సుప్రియ పవన్ కళ్యాణ్ తొలి సినిమా ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ సినిమా ద్వారా ఇండస్ట్రీ కి హీరోయిన్ గా పరిచయమైనా సంగతి మన అందరికి తెలిసిందే..హీరోయిన్ కి ఉండాల్సిన అన్ని లక్షణాలు పుష్కలంగా ఈ అమ్మాయి లో ఉన్నప్పటికీ కూడా ఎందుకో సినిమా ఇండస్ట్రీ తో మనకి ఎందుకులే అని దూరంగా ఉండిపొయ్యి అన్నపూర్ణ స్టూడియోస్ బాధ్యతలు చేపట్టింది..అయితే ఈమె చాలా కాలం తర్వాత అడవి శేష్ హీరో గా నటించిన గూఢచారి అనే సినిమా ద్వారా ఇండస్ట్రీ లోకి మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చింది..ఈ సినిమాకి ముందే అడవి శేష్ మరియు సుప్రియ ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్..దీనితో వీళ్లిద్దరు ప్రేమలో ఉన్నారని..డేటింగ్ చేస్తున్నారని..త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అంటూ సోషల్ మీడియా లో రకరకాల వార్తలు వచ్చాయి.
Also Read: Hari Hara Veera Mallu: నిర్మాతల షూటింగ్ బంద్.. ‘హరిహర వీరమల్లు’ పరిస్థితేంటి? ఫ్యాన్స్ లో ఆందోళన
ఈ గాసిప్స్ సుప్రియా గారి దాకా వెళ్లడం తో ఆమె గూఢచారి మూవీ టీం పై ఫైర్ అయ్యి నేను ఈ సినిమా చెయ్యడం లేదు అంటూ తెగేసి చెప్పింది..కానీ ఆ తర్వాత అడవి శేష్ బాగా రిక్వెస్ట్ చెయ్యడం తో సర్దుకొని ఈ సినిమాని పూర్తి చేసింది..అయితే ఈ రూమర్ గురించి ఇటీవలే జరిగిన ఒక ఇంటర్వ్యూ లో అడవి శేష్ ని అడగగా ‘మీకేమైనా పిచ్చా..తను నా క్లోజ్ ఫ్రెండ్..సోషల్ మీడియా లో రాసే పిచ్చి రాతలను తీసుకొచ్చి ఇలా అడుగుతారా’ అంటూ అడవి శేష్ ఫైర్ అయ్యాడు.
Recommended Videos