Site icon OkTelugu

Dacoit Movie Remake Controversy: ‘డెకాయిట్’ చిత్రం ఆ సినిమాకు రీమేక్ గా తెరకెక్కిందా.. ఇలాంటి ఫ్రీమేక్ ఈమధ్య కాలంలో రాలేదు..

Dacoit movie first day collections

Dacoit movie first day collections

Dacoit Movie Remake Controversy: ‘ అడివి శేష్(Adivi Sesh) హీరో గా నటించిన ‘డెకాయిట్'(Dacoit Movie) చిత్రం నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదలైంది. అడివి శేష్ నుండి ఒక సినిమా వస్తుందంటే , కచ్చితంగా చాలా అంచనాలతోనే థియేటర్ కి వెళ్తారు ఆడియన్స్. ఎందుకంటే ఆయన సినిమాల్లోని ట్విస్టులు, సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ఎవ్వరూ ఊహించని రేంజ్ లో ఉంటాయి. థియేటర్స్ లో వచ్చే ఆడియన్స్ ని థ్రిల్ కి గురి చేస్తుంటాయి. అవన్నీ ఆశించే ఈ చిత్రానికి నేడు వెళ్లారు ఆడియన్స్. ట్విస్టులు , సర్ప్రైజ్ ఎలిమెంట్స్ అయితే బలంగానే ఉన్నాయి కానీ , అవి సరిగా ల్యాండ్ అవ్వలేదు అనే అభిప్రాయం చూసిన ప్రతీ ఒక్కరికి కలిగింది. దీంతో మొట్టమొదటిసారి అడివి శేష్ సినిమాకు ఆడియన్స్ నుండి డివైడ్ టాక్ నమోదైంది. కానీ ఓపెనింగ్స్ కి ఈ టాక్ ఎలాంటి ప్రభావం చూపించలేదు కానీ, లాంగ్ రన్ లో ఎంత వరకు ప్రభావం చూపిస్తుందో చూడాలి.

ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాని చూసిన ప్రతీ ఒక్కరి నుండి వినిపిస్తున్న మాట ఏమిటంటే, అప్పట్లో జగపతి బాబు ‘అంతఃపురం’ అనే చిత్రం చేసాడు. దానికి మోడరన్ వెర్షన్ గా ఈ ‘డెకాయిట్’ చిత్రం తెరకెక్కింది అని అంటున్నారు. అంతే కాకుండా, సినిమాలోని క్లైమాక్స్ సన్నివేశాన్ని చూస్తుంటే, శ్రీకాంత్ – రాశీ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘ప్రేయసి రావే’ చిత్రం కూడా గుర్తుకు వస్తుందని అంటున్నారు. అడివి శేష్ సినిమాలన్నీ ఈమధ్య కాలం లో ఇలాగే ఉంటున్నాయి. ‘ఎవరు’ చిత్రం ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలోని వచ్చే ట్విస్టులు ఆడియన్స్ కి మైండ్ బ్లాక్ అయ్యినంత పని చేసింది. అయితే ఈ సినిమా ని హిందీ లో సూపర్ హిట్ గా నిల్చిన ‘బద్లా ‘ ని ఆదర్శంగా తీసుకొని చేశారు.

ఇప్పుడు ‘డెకాయిట్’ చిత్రం కూడా జగపతి బాబు ‘అంతఃపురం’ అని ఆధారంగా తీసుకొనే తెరకెక్కించారు , ఒకవేళ కాదు అంటే మేకర్స్ ఖచ్చికంగా అబద్దం చెప్తున్నట్టే అని అంటున్నారు విశ్లేషకులు. రీమేక్ చేయడం లో ఎలాంటి తప్పు లేదు , ఎందుకంటే రైట్స్ ని కొనుగోలు చేసి, న్యాయబద్దం గా చేస్తారు కాబట్టి. కానీ ఇలా ఫ్రీ మేక్ చేయడం మాత్రం తప్పు. ఒరిజినల్ వెర్షన్ మేకర్స్ ఒకవేళ ఇది మా స్టోరీ ని కాపీ కొట్టారు అంటూ కోర్టు మెట్లు ఎక్కితే కచ్చితంగా మూవీ టీం మొత్తం ఇబ్బంది పడాల్సి ఉంటుంది. అడివి శేష్ ఇలా పక్క సినిమాలను ప్రేరణ గా తీసుకొని స్టోరీలు రాయడం మానేసి , సొంతంగా కథలు రాస్తే బాగుంటుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.

Exit mobile version