Homeఎంటర్టైన్మెంట్Dacoit Release Postponed: అడవి శేష్ 'డెకాయిట్' విడుదల వాయిదా..'ధురంధర్ 2' దెబ్బ మామూలుగా లేదుగా!

Dacoit Release Postponed: అడవి శేష్ ‘డెకాయిట్’ విడుదల వాయిదా..’ధురంధర్ 2′ దెబ్బ మామూలుగా లేదుగా!

Dacoit Release Postponed: క్రైమ్ థ్రిల్లర్ జానర్ లో సినిమాలు తీస్తూ, ప్రేక్షకులకు సరికొత్త థియేట్రికల్ అనుభూతిని అందించాలనే తపనతో ఉండే హీరో అడివి శేష్(Adivi Sesh). క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్ గా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన ఆయన, చూస్తూ ఉండగానే హీరో గా ఎంత పెద్ద రేంజ్ కి వెళ్లిపోయాడో మన అందరికీ తెలిసిందే. అడివి శేష్ సినిమా అంటే బ్రాండ్, కచ్చితంగా థియేటర్స్ లోనే ఆయన సినిమాలు చూడాలి అనే ఫీలింగ్ ని కల్పించాడు. అయితే ఆయన చివరి సారిగా హీరో గా వెండితెర పై కనిపించిన చిత్రం ‘హిట్ : ది సెకండ్ కేస్’. ఈ సినిమా తర్వాత ఆయన నుండి ఎలాంటి సినిమా రాలేదు. ‘హిట్ : ది థర్డ్ కేస్’ చిత్రం లో అతిథి పాత్రలో కాసేపు వెండితెర పై కనిపించాడు అంతే. అయితే ఆయన ప్రస్తుతం హీరో గా చేస్తున్న చిత్రం ‘డెకాయిట్'(Dacoit Movie).

శానీల్ డియో దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా మృణాల్ ఠాకూర్ నటిస్తోంది. ముందుగా ఈ చిత్రం లో హీరోయిన్ పాత్ర కోసం శృతి హాసన్ ని తీసుకున్నారు. ఆమెతో కొన్ని రోజుల పాటు షూటింగ్ జరిపి, ఆమెకు సంబంధించిన ఒక టీజర్ వీడియో ని కూడా విడుదల చేశారు. కానీ డేట్స్ విషయం లో చిన్న క్లాష్ వచ్చి ఆమె చిత్రం నుండి తప్పుకోవాల్సి వచ్చింది. దీంతో మేకర్స్ మృణాల్ ఠాకూర్ ని ఎంచుకోవడం, గతంలో శృతి హాసన్ తో తీసిన సన్నివేశాలను మొత్తం మృణాల్ ఠాకూర్ తో తీయడం వల్ల చాలా సమయం పట్టింది. గత ఏడాది విడుదల అవ్వాల్సిన ఈ సినిమా, మార్చి 19 న విడుదల చేయబోతున్నట్టు గత ఏడాది చిన్న టీజర్ ద్వారా తెలిపారు మేకర్స్. అయితే ఇప్పుడు ఈ సినిమా మార్చి 19 న విడుదల కావడం లేదని విశ్వసనీయ వర్గాల సమాచారం.

ఎందుకంటే మార్చి 19న ‘ధురంధర్ 2 : ది రివెంజ్’ చిత్రం విడుదల కాబోతుంది. ఈ సినిమాపై యూత్ ఆడియన్స్ లో ఉన్న అంచనాలు సాధారణమైనవి కాదు. మొదటి భాగం ప్రపంచవ్యాప్తంగా సృష్టించిన సెన్సేషన్ ని అంత తేలికగా ఎవ్వరూ మర్చిపోలేరు. మెయిన్ స్టోరీ మొత్తం రెండవ భాగం లో ఉండడం తో తెలుగు లో కూడా అంచనాలు భారీ గా ఏర్పడ్డాయి. ఇలాంటి క్రేజీ సినిమాకు ఎదురు రాకుండా ఉండడం కోసమే ‘డెకాయిట్’ ని వాయిదా వేసినట్టు తెలుస్తోంది. ఏప్రిల్ 10 న ‘డెకాయిట్’ ని విడుదల చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version