Aditya 369 sequel: తెలుగు వెండితెరపై వైవిధ్యానికి ప్రతినిధి ఆయన, కాలాన్ని కట్టేసి భవిష్యత్తును చూపించిన ఘనమైన దార్శనిక దర్శకుడు ఆయన, తన ఊహతో ఈ సినీ జగత్తులో ఎన్నో గమ్మత్తులు చేసి చూపించిన దర్శక దిగ్గజం ఆయన.. ఆయనే ‘సింగీతం శ్రీనివాసరావు’. ఆయన దర్శకత్వంలో వచ్చి గొప్ప వైవిధ్యమైన సినిమాగా నిలిచిపోయింది ‘ఆదిత్య 369’.

బాలయ్య బాబు హీరోగా వచ్చిన ఈ సినిమా నేటికి తెలుగు సినిమాకు ప్రత్యేక సినిమానే. అందుకే, ఈ సినిమాకు ఇప్పటికీ అభిమానులు ఉన్నారు. అందుకేనేమో సింగీతం శ్రీనివాసరావు గారు ఎలాగైనా ఈ సినిమా సీక్వెల్ ను తీయాలని ఎంతో తపన పడుతున్నారు. అయితే, ప్రస్తుతం సింగీతం గారి వయసు 90 సంవత్సరాలు. అంటే దాదాపు 9 దశాబ్దాలు చూసిన పరిపూర్ణమైన వ్యక్తి.
90 ఏళ్ళ వయసులో ఒక భారీ సినిమాకు దర్శకత్వం వహించడం అంటే ఎంతో సాహసంతో కూడుకున్న పనే. అయినా అలనాటి క్లాసిక్ మాయాబజార్ తో జీవితాన్ని ప్రారంభించి.. నేటికి సినిమా పై ఎంతో ఉత్సాహం కనబరుస్తుండటం అంటే.. బహుశా అది ఒక్క సింగీతంకే సాధ్యం అనుకుంటా. పైగా ఆయన ఇప్పటికే సీక్వెల్ స్క్రిప్ట్ ను కూడా పూర్తి చేశారు.
Also Read: Pushpa Movie: ‘పుష్ప’కు అక్కడ మైనస్.. ఇక్కడ ప్లస్?
టైమ్ మెషీన్ ఆధారంగానే ఈ సీక్వెల్ కూడా తెరకెక్కనుంది. ఆ రోజుల్లో ‘ఆదిత్య 369’ సినిమా చూసి జనం ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఇలా కూడా సినిమా తీయొచ్ఛా అని. అప్పట్లో ఈ సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడు కృష్ణదేవరాయల కాలానికి వెళ్లిపోయినట్లు ఫీల్ అయ్యాడు. దానికి తగ్గట్టుగానే అప్పటి కాలాన్ని అద్భుతంగా చూపించారు సింగీతం.
మరి ఇప్పుడు ఈ సీక్వెల్ ను అంతకంటే గొప్పగా ప్లాన్ చేస్తున్నారట. ప్రేక్షకుడు చరిత్రలోకి వెళ్లాడు. అలాగే భూగర్భంలో బతుకుతున్న మానవజాతిని కూడా ఈ సారి చాలా పరిశీలనగా చూస్తాడట. ఆ స్థాయిలో తన సీక్వెల్ ఉంటుందని సంగీతంగారు చెబుతున్నారు. అయితే, హీరో ఎవరు అనేది ఆయన ఇంకా చెప్పలేదు.
Also Read: Anchor Anasuya: తండ్రిని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టిన అనసూయ…