Bheemla Nayak: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా సినిమా భీమ్లా నాయక్. సాగర్ కే చంద్ర ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా… సీతార ఎంటర్ ప్రైజెస్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నిత్యామీనన్… రానాకి జోడీగా సంయుక్త మీనన్ నటిస్తోంది. మలయాళంలో సూపర్ ఐటి గా నిలిచిన “అయ్యప్పనుమ్ కోషీయం” సినిమాకు రీమేక్ గా ఈ మూవీ ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తుండగా… మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే బాధ్యతలు చేపట్టడం విశేషం. ఇక భీమ్లా నాయక్ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్లు, పాటలకు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన లభిస్తుంది.
ఇక తాజాగా ఈ సినిమా నుంచి మరో బిగ్ అప్ డేట్ వచ్చింది. ఈ సినిమా నాలుగవ సింగిల్ ను రిలీజ్ డేట్ ను ఇది వరకే ప్రకటించారు. కాగా ప్రముఖ కవి, గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి అకాల మృతి కారణంగా రిలీజ్ ను వాయిదా వేశారు. ఇప్పుడు ఈ పాటను డిసెంబర్ 4వ తేదీ ఉదయం 10:08 గంటలకు విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం తెలిపింది. “అడవి తల్లి మాట” అంటూ సాగే ఈ గీతాన్ని విడుదల చేయనుంది మూవీ యూనిట్. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్, రానా కలిసి ఉన్న ఒక పోస్టర్ ను విడుదల చేశారు. ఇక ఈ అప్ డేట్ తో పవన్, రానా అభిమానుల్లో ఫుల్ జోష్ నెలకొంది.
అడవి తల్లి మాట❤️#BheemlaNayak 4th Single #AdaviThalliMaata will be out tomorrow at 10:08am🎵
A @MusicThaman Musical 🎶@pawankalyan @RanaDaggubati #Trivikram @saagar_chandrak @MenenNithya @iamsamyuktha_ @ramjowrites @dop007 @NavinNooli @vamsi84 @adityamusic pic.twitter.com/1Q836EsLT3
— Sithara Entertainments (@SitharaEnts) December 3, 2021
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Adavi thalli song from bheemla nayak movie releasing on december 4th
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com