Actress Urvashi Daughter: స్టార్ హీరోల సినిమాలలో కూడా నటించి బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అందుకుంది. ఇప్పటికీ సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ బిజీగా గడుపుతుంది నటి ఊర్వశి. సినిమా ఇండస్ట్రీలోకి త్వరలోనే నటి ఊర్వసి కూతురు కూడా ఎంట్రీ ఇస్తున్నట్లు తెలుస్తుంది. సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఊర్వసి చైల్డ్ ఆర్టిస్టుగా, హీరోయిన్ గా అలాగే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా 100 సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి సూపర్ హిట్ సినిమాలలో కూడా నటించి మెప్పించింది. అన్ని భాషలలో కలిపి ఊర్వశి ఇప్పటివరకు 700 పైగా సినిమాలలో నటించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. తెలుగులో ఈమె అంతిమ తీర్పు, రుస్తుం, చెట్టు కింద ప్లీడర్, విజయరామరాజు, పాడుతా తీయగా, సందడే సందడి వంటి పలు సూపర్ హిట్ సినిమాలలో నటించి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా సినిమా ఇండస్ట్రీలో రాణిస్తుంది.
Also Read: ఓజీ వచ్చేది అప్పుడే…మరోసారి క్లారిటీ ఇచ్చిన దర్శక నిర్మాతలు…
సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ సాధించిన ఊర్వశి తన వ్యక్తిగత జీవితంలో మాత్రం చాలా ఒడిదుడుకులను ఎదుర్కొంది. నటి ఊర్వశి కెరియర్ బాగా ఫామ్ లో ఉన్న సమయంలోనే మనోజ్ జయన్ అనే నటుడిని ప్రేమించి 2000 లో పెళ్లి చేసుకుంది. ఈ దంపతులకు తేజా లక్ష్మీ అనే కూతురు కూడా ఉంది. ఆ తర్వాత నటుడు మనోజ్తో ఊర్వశికి విభేదాలు రావడంతో విడాకులు తీసుకొని ఈ జంట విడిపోయారు. ఆ తర్వాత ఊర్వశి శివప్రసాద్ ని 2013లో పెళ్లి చేసుకుంది. ఈ దంపతులకు ఇషాన్ అనే కొడుకు పుట్టాడు. కానీ ఊర్వశి కూతురు తేజ లక్ష్మి మాత్రం తన తండ్రి మనోజ్ తో కలిసి ఉంటుంది. ప్రస్తుతం తేజ లక్ష్మి తన తల్లి లాగానే సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీగా ఉంది. ఈ విషయాన్ని నటి ఊర్వశి స్వయంగా తెలిపారు.
తన కూతురి సినిమా ఎంట్రీ గురించి మాట్లాడిన నటి ఊర్వశి ఈ సినిమాల వలన తాను తన చదువును మధ్యలో మానేయాల్సి వచ్చిందని. తన కూతురికి అలాంటి పరిస్థితి రాకూడదని దేవుడిని చాలాసార్లు కోరుకున్నట్లు తెలిపింది. కాబట్టి తన కూతురిని ముందు తన చదువు పూర్తి చేయమన్నాను.ఆ తర్వాత తనకు ఆసక్తి ఉంటే సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టమన్నాను అంటూ తెలిపింది. ముందుగా తన కాళ్ళపై తాను నిలబడి ఆ తర్వాత సినిమాల గురించి ఆలోచించమన్నట్లు నటి ఊర్వశి తెలిపింది. ఈ మధ్యనే తన కూతురి ఉన్నత చదువులు కూడా పూర్తి అవడంతో తనతో సినిమా అవకాశాలు కూడా వస్తున్నట్లు ఊర్వశి తెలిపింది. ఊర్వసి కూతురు తేజలక్ష్మికి సంబంధించిన కొన్ని లేటెస్ట్ ఫోటోలు సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్నాయి.