Homeఎంటర్టైన్మెంట్Actress Samantha తాప్సీ నిర్మాణంలో మూవీ చేయనున్న సమంత...

Actress Samantha తాప్సీ నిర్మాణంలో మూవీ చేయనున్న సమంత…

Actress Samantha ప్రస్తుతం నేటి తరం అమ్మాయిలు అన్ని రంగాల్లో రాణిస్తూ విజయం సాధిస్తున్నారనే చెప్పాలి. వారిలో హీరోయిన్లు కూడా ఉన్నారు. సినీ పరిశ్రమలో హీరోయిన్లు గానే కాకుండా దర్శకులుగా, నిర్మాతలుగా రాణిస్తున్న వారు ఉన్నారు. ప్రస్తుతం మన తెలుగు హీరోయిన్లలో నిర్మాతగా రాణిస్తున్న వారిని వేళ్ళ మీదే లెక్కబెట్టొచ్చు. వీరిలో స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్, మెగా డాటర్ నిహారిక ఉన్నారు. ఇటీవలే కాజల్ “మను చరిత్ర” అనే సినిమాను తెరకెక్కిస్తుండగా… నిహరిక ఒక వెబ్ సిరీస్ ను రూపొందిస్తుంది. ఇప్పుడే వీరి బాటలోనే ప్రముఖ నటి తాప్సీ కూడా వెళ్లనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

actress tapsee planning to produce a movie with samantha in lead role

హీరోయిన్ గా ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్న ఈ భామ… నిర్మాణ రంగం వైపు అడుగులు వేయనుందని తెలుస్తుంది. ఇటీవ‌ల ‘అవుట్‌ సైడర్స్‌ ఫిలిమ్మ్స్‌’ అనే నిర్మాణ సంస్థ ఏర్పాటు చేసింది తాప్సీ. స్వంతంగా సినిమాల్ని తెరకెక్కించడానికి ఈమె సన్నాహాలు చేస్తోంది. అందులో భాగంగా సమంతతో ఓ ప్రాజెక్టు చేయబోతున్న‌ట్టు ఇండ‌స్ట్రీ టాక్. వీరి కాంబోలో హీరోయిన్ ఓరియెంటెడ్ థ్రిల్లర్ మూవీని తెర‌కెక్కించ‌డానికి ఆస‌క్తి క‌న‌బ‌రుస్తున్నట్టు అనుకుంటున్నారు. త్వరలోనే ఈ మేరకు అధికారిక ప్రకటన రాబోతుంది. వారి మ‌ధ్య డీల్ ఓకే అయితే… సమంత చేసే తొలి బాలీవుడ్ ప్రాజెక్ట్ ఇదే అవుతుంది.

మరోవైపు చైతూ నుంచి విడాకులు తీసుకున్న తర్వాత ఇప్పుడిప్పుడే సమంత త‌న సినీ కెరీర్‌పై ఫోకస్ పెట్టింది. వరుస సినిమాలు చేసేందుకు ప్రయత్నిస్తోంది. తెలుగులో `శాకుంతలం`, తమిళంలో `కాతువాక్కుల రెండు కాదల్` సినిమాలను విడుదలకు సిద్ధం చేస్తోంది. అలాగే తెలుగులో మరో సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన‌ట్టు టాక్.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Most Popular

Furniture Rental: ఇల్లు మారుతున్నారా? ఇక ఇంటి సామగ్రి కొనాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే..

Furniture Rental: కొత్తగా ఉద్యోగంలో చేరిన చేరిన వారు.. రకరకాల కారణాల వల్ల నిత్యం నగరాలకు వలస వెళ్లే వారికి ఇంటి సామగ్రిని సమకూర్చుకోవడం పెద్ద ప్రయాసే. అద్దె ఇల్లు అయినా...

Today 22 July 2026 Horoscope: ఈ రాశుల వారి ఆదాయం ఈరోజు రెండింతలు.. ఏ పని...

Today 22 july 2026 horoscope : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధవారం ద్వాదశ రాశులపై విశాఖ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు తులా రాశిలో సంచారం చేయనున్నాడు. దీంతో కొన్ని...

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...
Oktelugu Epaper
Exit mobile version