Actress Shobana Corona Positive: ప్చ్.. క్లాసికల్ హీరోయిన్ కి కూడా కరోనా పాజిటివ్ !

Actress Shobana Corona Positive: ప్రముఖ నటి, డాన్సర్ శోభనను కోవిడ్ అటాక్ చేసింది. ఆమె కుటుంబ సభ్యులంతా కరోనా బారిన పడ్డారట. ఇన్ స్టాగ్రామ్ లో ఈ విషయాన్ని తెలియజేస్తూ.. ‘నేను కరోనా వైరస్ భారిన పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాను. అయితే కరోనా వైరస్ మాత్రం నన్ను వదలలేదు. కానీ నేను వ్యాక్సిన్ తీసుకున్నందుకు చాలా సంతోషిస్తున్నాను, ఎందుకంటే 85 శాతం వరకు వైరస్ అభివృద్ధి చెందకుండా టీకా నిరోధిస్తుంది’ అని చెప్పుకొచ్చింది శోభన. […]

Written By: Sekhar Katiki, Updated On : January 10, 2022 1:15 pm
Follow us on

Actress Shobana Corona Positive: ప్రముఖ నటి, డాన్సర్ శోభనను కోవిడ్ అటాక్ చేసింది. ఆమె కుటుంబ సభ్యులంతా కరోనా బారిన పడ్డారట. ఇన్ స్టాగ్రామ్ లో ఈ విషయాన్ని తెలియజేస్తూ.. ‘నేను కరోనా వైరస్ భారిన పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాను. అయితే కరోనా వైరస్ మాత్రం నన్ను వదలలేదు. కానీ నేను వ్యాక్సిన్ తీసుకున్నందుకు చాలా సంతోషిస్తున్నాను, ఎందుకంటే 85 శాతం వరకు వైరస్ అభివృద్ధి చెందకుండా టీకా నిరోధిస్తుంది’ అని చెప్పుకొచ్చింది శోభన.

Actress Shobana tests positive for Corona

Also Read: ప్రముఖ హాస్య నటుడు అనుమానాస్పద స్థితిలో మృతి !

ఇక గత కొన్ని రోజులుగా శోభన ఓ మలయాళ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. పైగా కరోనా అని తేలింది కూడా ఆమెకు షూటింగ్ స్పాట్ లోనే అని తెలుస్తోంది. దాంతో ఇప్పుడు ఆ సినిమాకి చెందిన యూనిట్ సభ్యులు ఐసోలేషన్ కి వెళ్లక తప్పలేదు. ఏది ఏమైనా కరోనా భయం మళ్ళీ మొదలైంది. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో కరోనా మూడో వేవ్ కేసులు కూడా వేగంగా పెరుగుతున్నాయి. అసలు కరోనా మూడో వేవ్ ఇంత వేగంగా వ్యాప్తి చెందుతుందని ఎవ్వరూ ఊహించని ముందే వరుసగా కేసులు నమోదు అవుతున్నాయి.

ఇక శోభన ఇప్పటికీ మంచి క్లాసిక్ డ్యాన్సర్ గానే మిగిలిపోయింది. అయితే, ఒకప్పుడు శోభన క్లాస్ హీరోయిన్ గా ఆమెకు ఫుల్ ఫాలోయింగ్ ఉండేది. ఇక 51 ఏళ్ల వయసొచ్చినా పెళ్లి మాత్రం చేసుకోలేదు. కారణం.. నాట్యం పై ఆమెకున్న అమితమైన అభిరుచేనట. తన జీవితాన్ని నాట్యానికి త్యాగం చేశాను అని ఆమె ఓ సందర్భంలో చెప్పింది.

Also Read: ప్చ్.. హీరోయిన్లను అసలు వదిలిపెట్టడం లేదుగా !

Tags