Actress Rashmika: ఛలో సినిమా తో తెలుగు తెరకు పరిచయం అయ్యారు హీరోయిన్ రష్మిక మందన్న.మొదటి సినిమాతోనే ప్రేక్షకులలో మంచి గుర్తింపు పొందింది ఈ ముద్దుగుమ్మ. అయితే ఆ తరువాత వచ్చిన గీత గోవిందం, డియర్ కామ్రేడ్,భీష్మ,దేవదాసు వంటి చిత్రాలతో స్టార్ హీరోయిన్ గా ఎదిగారు. సోషల్ మీడియా లోనూ యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులతో టచ్ లో ఉంటారు ఈ భామ. అయితే తాజాగా డేటింగ్ గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలను చేసింది రష్మిక.
డేటింగ్ పై టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న సంచలన వ్యాఖ్యలు చేసింది. కాగా డేటింగ్ చేసే వ్యక్తి మన గురించి మంచి అభిప్రాయం తో ఉండాలని అన్నారు. అలా ఉంటే వయస్సు తో సంబంధం లేకుండా డేటింగ్ చేయవచ్చు అని రష్మిక అంది. వయస్సు అనేది చాలా చిన్న అంశం అని రష్మిక అంది. మనకు అబ్బాయి నచ్చితే వయస్సు తో సంబంధం లేకుండా డేటింగ్ చేయవచ్చు అని అంది. అయితే ఆ అబ్బాయి మనల్ని మార్చకుండ ఉండాలని తెలిపింది.
అయితే రష్మిక వ్యాఖ్య లపై అభిమానుల నుంచి భిన్న అభిప్రాయాలు వస్తున్నాయి.ప్రసుతం ఈమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి రష్మిక తెలుగులో అల్లు అర్జున్ సరసన సినిమాలో నటిస్తుంది ఈ సినిమాకి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు మరోవైపు బాలీవుడ్ లో కూడా ఈ భామ ఫుల్ ఫామ్ లో దూసుకుపోతుంది. బాలీవుడ్ లో సిద్ధార్థ్ మల్హోత్రా పక్కన హీరోయిన్ గా చేస్తున్న ” మిషన్ మజ్ను ” అనే సినిమా షూటింగ్ ఇటివలే పూర్తి చేసుకుంది.