Poonam Kaur: పవన్ కళ్యాణ్ డైలాగ్.. త్రివిక్రమ్ రైటింగ్.. ప్రణీత్ హనుమంతు విషయంలో ఇచ్చిపడేసిన పూనమ్ కౌర్…

Poonam Kaur: ఇండస్ట్రీలో ఏ ఫ్యామిలీకి లేని గుర్తింపు 'మెగా ఫ్యామిలీ' కి మాత్రమే దక్కింది. ఇక ఇదిలా ఉంటే మెగా మేనల్లుడు గా గుర్తింపు పొందిన 'సాయిధరమ్ తేజ్' సైతం రీల్ హీరోగానే కాకుండా రియల్ హీరో గా ప్రస్తుతం గుర్తింపు పొందుతున్నాడు. ఎందుకు అంటే ప్రణీత్ హనుమంతు అనే ఒక వ్యక్తి డార్క్ కామెడీ....

Written By: Gopi, Updated On : July 10, 2024 10:18 am

Poonam Kaur shocking comments on Praneeth Hanumantu

Follow us on

Poonam Kaur: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. వీళ్ళ ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలందరూ కూడా తమదైన రీతిలో సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే వీళ్ళ నుంచి ఒక సినిమా వస్తుంది అంటే ప్రేక్షకులందరికీ ఒక పండుగనే చెప్పాలి. వీళ్ళ సినిమాలను ఆదరించడానికి ప్రేక్షకులు ఎప్పుడు ముందు వరుసలో ఉంటారు. ఇక వాళ్లు కూడా ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయడం లో తమదైన రీతిలో ఎఫర్ట్స్ పెడుతూ ముందుకు సాగుతూ ఉంటారు.

ఇక దీనివల్లే ఇండస్ట్రీలో ఏ ఫ్యామిలీకి లేని గుర్తింపు ‘మెగా ఫ్యామిలీ’ కి మాత్రమే దక్కింది. ఇక ఇదిలా ఉంటే మెగా మేనల్లుడు గా గుర్తింపు పొందిన ‘సాయిధరమ్ తేజ్’ సైతం రీల్ హీరోగానే కాకుండా రియల్ హీరో గా ప్రస్తుతం గుర్తింపు పొందుతున్నాడు. ఎందుకు అంటే ప్రణీత్ హనుమంతు అనే ఒక వ్యక్తి డార్క్ కామెడీ రూపం లో అసభ్యకరమైన పదాలను వాడుతూ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటాడు. అలాంటి ఒక యూట్యూబర్ ను గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లి అతని మీద చర్యలు తీసుకునే దాకా తను నిద్రపోలేదు. నిజానికి ప్రణీత్ హనుమంతు లాంటి వాళ్ళు సమాజంలో ఉండడం సమాజానికి చాలావరకు కీడు చేసే అంశం అనే చెప్పాలి. డార్క్ కామెడీ రూపంలో ఏది పడితే అది మాట్లాడుతూ యూట్యూబ్ కి సెన్సార్ లేదు కదా అని ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తే మాత్రం జనాలు ఎవ్వరూ చూస్తూ ఊరుకోరు అనేది మరొకసారి ప్రూవ్ చేశారు.

మొత్తానికైతే ఈ ఎంటైర్ సిచువేషన్ ను గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లడం లో సాయిధరమ్ తేజ్ కీలకపాత్ర వహించాడు. ఇక ఈ విషయం మీద ఒకప్పటి హీరోయిన్ అయిన పూనమ్ కౌర్ సైతం సాయి ధరమ్ తేజ్ మీద ప్రశంసల వర్షం కురిపించింది. ఇక ఇదిలా ఉంటే కొంతమంది నెటిజన్లు మాత్రం సాయిధరమ్ తేజ్ చేసిన పనిని గుర్తిస్తూనే ‘జల్సా’ సినిమాలో పవన్ కళ్యాణ్ పడుకునే వాళ్ళను రేపు చేస్తే ఏమస్తుంది అంటూ బ్రహ్మానందం తో చెప్పే ఒక డైలాగ్ ని షేర్ చేస్తూ ముందు ఇలాంటి సినిమాలు తీసేవాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి అన్నట్టుగా కామెంట్ చేశాడు… ఇక దాని మీద కూడా పూనమ్ కౌర్ స్పందిస్తూ ఆ డైలాగ్ చెప్పింది పవన్ కళ్యాణ్ అయిన కూడా అది రాసింది మాత్రం త్రివిక్రమ్.. ఆయన అంతకంటే గొప్పగా ఏం రాయగలడు అంటూ త్రివిక్రమ్ పైన పంచులు వేసింది.

ఇది చూసిన త్రివిక్రమ్ అభిమానులు కూడా నువ్వేప్పుడు త్రివిక్రమ్ ను పట్టుకొని ఏదో ఒక మాట అంటూ ఉంటావ్..ఎందుకలా అనడం అంటూ కామెంట్లు చేస్తున్నారు. నిజానికి పూనమ్ కౌర్ ఇంతకుముందు గురూజీ అంటూ ఆయన గురించి కామెంట్లు చేసేది.కానీ ఇప్పుడు డైరెక్ట్ గా త్రివిక్రమ్ అంటూనే ఓపెన్ గా మాట్లాడుతుంది. అసలు ఆమెకి త్రివిక్రమ్ కి మధ్య ఉన్న గొడవ ఏంటి? అసలు ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న సిచువేషన్ ఏంటి? మధ్యలో త్రివిక్రమును ఎందుకు లాగుతున్నారు అంటూ మరి కొంత మంది కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి జల్సా సినిమా సమయం నుంచి పూనమ్ కౌర్ కి త్రివిక్రమ్ కి మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయని కొంతమంది సినీ మేధావులు చెబుతూ ఉంటారు…