Radhe Shyam: బాహుబలి సినిమా తో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నారు రెబల్ స్టార్ ప్రభాస్. వరుసగా పాన్ ఇండియా చిత్రాలతో తనదైన శైలిలో దూసుకుపోతున్నారు ఈ స్టార్ హీరో. బాహుబలి, సాహో తరువాత భారీ అంచనాలతో తెరకెక్కిన చిత్రం “రాధే శ్యామ్”. ఈ సినిమాలో ప్రభాస్ సరసన అందాల బుట్ట బొమ్మ పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ పీరియాడిక్ లవ్ స్టోరీ కి జిల్’ ఫేం రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తుండగా భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా యూవీ క్రియేషన్స్ – టీ సిరీస్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి తెలుగుతో పాటు మిగతా సౌత్ భాషలలో జస్టిన్ ప్రభాకరన్, హిందీ భాషకు గానూ మనన్ భరద్వాజ్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్, పాటలు ఈ సినిమా పై భారీ ఎక్స్పెక్టేషన్స్ పెంచాయి.

Also Read: RRR Movie: “ఆర్‌ఆర్‌ఆర్” ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్… పూనకాలకు రెడీ గా ఉండండి అంటూ
వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14న 7 భాషలలో ఈ మూవీ ప్రేక్షక అభిమానులను అలరించనుంది. ఈ సినిమాకు సంబంధించిన డబ్బింగ్ పనులను హుటాహుటి గా పూర్తిచేస్తున్నారు మేకర్స్. ఈ సినిమాలో పూజ హెగ్డే ” ప్రేరణ” గా అభిమానులను అలరించనున్నారు. అయితే తాజాగా తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ పనులను పూర్తి చేశారు పూజా. ఇందుకు సంబంధించిన ఫోటోను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. ఇందులో రెబల్ స్టార్ కృష్ణంరాజు, బాలీవుడ్ సీనియర్ నటి భాగ్యశ్రీ, జగపతి బాబు, మురళీ శర్మ, తమిళ్ యాక్టర్ సత్యన్ తదితరులు కీలకపాత్రలలో కనిపించబోతున్నారు. ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.