Payal Rajput: పంజాబీ ముద్దుగుమ్మ పాయల్ రాజ్‌పుత్ ఆర్ ఎక్స్ 100 సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అయ్యారు హాట్ బ్యూటీ పాయల్. ఈ సినిమాతో ఓవర్ నైట్ హీరోయిన్ గా ఎదిగారు ఈ భామ. ఆ తర్వాత ఆమె స్టార్ హీరోయిన్ రేంజ్ వెళ్ళిపోతుంది అని అనుకున్నారు అభిమానులు. అలానే ఈ అమ్మడు సోషల్ మీడియా లో తన హాట్ లుక్స్ తో యూత్ ను ఫిదా చేస్తూ ఫాలోవర్స్ ను పెంచుకుంటున్నారు. ప్రస్తుతం ఓటిటి వేదికైన ఆహా లో ఒక వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు. అయితే ఆర్ఎక్స్ 100 విజయం తర్వాత ఈ అమ్మడు ఖాతాలో అలాంటి విజయం చేకూరలేదనే చెప్పాలి. ఆర్డీఎక్స్ లవ్ , వెంకీ మామ, రవితేజతో డిస్కో రాజా వంటి చిత్రాల్లో నటించిన ఆ పాత్రలు ఆమెకు అంతగా క్రేజ్ తెచ్చి పెట్టలేదనే చెప్పాలి.
Also Read: RRR Movie: “ఆర్‌ఆర్‌ఆర్” ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్… పూనకాలకు రెడీ గా ఉండండి అంటూ
డైరెక్టర్ తేజ దర్శకత్వంలో సీత సినిమాలో ఓ ఐటెం సాంగ్ చేసినా అక్కడ కూడా దర్శకులను మెప్పించలేక పోయారు ఈ అమ్మడు. ప్రస్తుతం తెలుగులో ఆది సాయి కుమార్ సరసన వీర భద్రమ్ దర్శకత్వంలో రూపొందిన క్రైమ్ థ్రిల్లర్ చిత్రంలో చేస్తోంది. తెలుగులో అవకాశాలు లేకపోవటంతో కన్నడ సినిమా ఇండస్ట్రీపై ఫోకస్ పెట్టింది పాయల్. అక్కడ ధనంజయ హీరోగా తెరకెక్కుతున్న జయరాజ్ బయోపిక్ ‘హెడ్ బుష్’లో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాతో తన కన్నడ సినిమా కెరీర్ ఆశలన్నీ ఈ బయోపిక్ మూవీ పైనే ఉన్నాయనే చెప్పాలి. పాయల్ కన్నడ ఇండస్ట్రీలోనైనా స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకుంటుందా లేదా అనేది చూడాలి మరి.