Nivedha Thomas: నివేదా థామస్… తనదైన నటనతో ప్రేక్షకులకు మైమరిపించగలదు ఈ ముద్దుగుమ్మ. ఇటీవలే పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ సినిమాలో పల్లవి పాత్రలో అదరగొట్టేసింది నివేదా. ఆమె నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారనే చెప్పాలి. అయితే తాజాగా ఈ అమ్మడు చేసిన ఒక పని గురించి సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.

ఆఫ్రికాలోని అత్యంత ఎత్తయిన శిఖరం కిలిమంజారోను అధిరోహించిన నివేదా… శిఖరాగ్రంపై త్రివర్ణ పతకాన్ని రెపరెపలాడించింది. ఆ ఫొటోని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. ఎత్తైన పర్వతం అధిరోహించడం చాలా సంతోషంగా ఉందంటూ ట్విట్టర్లో పేర్కొంది.
https://twitter.com/i_nivethathomas/status/1451799887973126150?s=20
బాలనటిగా కెరీర్ ప్రారంభించిన నివేదా థామస్ మొదట్లో మళయాలం, తమిళంలో వరుస సినిమాల్లో నటించింది. నాని హీరోగా నటించి ‘జెంటిల్‌మెన్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. తొలి సినిమాలోనే తన నటనతో ప్రేక్షకులను పిధా చేసిన నివేదా తర్వాత వరుస ఆఫర్లు అందిపుచ్చుకుంది. జెంటిల్ మెన్, నిన్ను కోరి, జై లవకుశ, 118, బ్రోచేవారెవరురా’ సినిమాలతో సూపర్ సక్సెస్ అందుకుంది. అటు తమిళంలోనూ సూపర్ స్టార్ రజనీకాంత్ దర్బార్ తో ప్రేక్షకుల నుంచి మంచి మార్కులే సంపాదించుకుంది. అలానే గతంలో విజయ్ – మోహన్ లాల్ కాంబోలో వచ్చిన జిల్లా సినిమాలోనూ విజయ్ చెల్లెలి క్యారెక్టర్ లో కనిపించింది నివేదా.
ఇక నివేదా థామస్ కొత్త ప్రాజెక్ట్స్ విషయానికొస్తే సుధీర్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరోవైపు ‘మిడ్ నైట్ రన్నర్స్’ అనే కొరియన్ చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ లోనూ నటిస్తోంది. ప్రస్తుతం ఆమె చేసిన పోస్ట్ నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది.