https://oktelugu.com/

Krithi Shetty : శృంగారం అనేది సంప్రదాయం లాంటిది – కృతి శెట్టి

Krithi Shetty Speaks About Bold Scenes :  లక్కీ హీరోయిన్ గా  కృతి శెట్టికి తెలుగు చిత్రసీమలో ఫుల్ నేమ్ వచ్చేసింది.  పాపం ఏళ్లకు ఏళ్ళు బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న హీరోయిన్స్  అంతా  ఇప్పుడు కృతి పాపను చూసి  కుళ్లుకుంటున్నారు.  కృతి శెట్టి చాలా లక్కీ అని,  తమకు రావాల్సిన అవకాశం ఆమెకు చాలా  త్వరగా వచ్చిందని  కొందరు హీరోయిన్లు  పెదవి విరుస్తున్నారు. ఏది ఏమైనా   ఈ కన్నడ భామ ఉప్పెన సినిమాతో  కుర్ర హృదయాలకు గిలిగింతలు పెట్టింది.    […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : January 21, 2022 / 07:00 PM IST
    Follow us on

    Krithi Shetty Speaks About Bold Scenes :  లక్కీ హీరోయిన్ గా  కృతి శెట్టికి తెలుగు చిత్రసీమలో ఫుల్ నేమ్ వచ్చేసింది.  పాపం ఏళ్లకు ఏళ్ళు బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న హీరోయిన్స్  అంతా  ఇప్పుడు కృతి పాపను చూసి  కుళ్లుకుంటున్నారు.  కృతి శెట్టి చాలా లక్కీ అని,  తమకు రావాల్సిన అవకాశం ఆమెకు చాలా  త్వరగా వచ్చిందని  కొందరు హీరోయిన్లు  పెదవి విరుస్తున్నారు. ఏది ఏమైనా   ఈ కన్నడ భామ ఉప్పెన సినిమాతో  కుర్ర హృదయాలకు గిలిగింతలు పెట్టింది.   

    Krithi Shetty

    అమ్మడు క్యూట్ లుక్స్ కి   తెలుగు కుర్రోళ్ళు దాసోహం మహాప్రభో అంటూ.. నిద్రలో  కూడా   కృతి శెట్టి..  కృతి శెట్టి.. అంటూ  కలవరింతలు పెడుతున్నారు.  మొత్తమ్మీద చాలా స్పీడ్ గా కృతి  సూపర్ పాపులారిటీ తెచ్చుకుంది.  అయితే,   హోమ్లీగా కనిపించే కృతి శెట్టి తన సినిమాల్లో బోల్డ్ సన్నివేశాల్లో రెచ్చిపోవడం హాట్ టాపిక్ గా మారింది.  కాగా తాజాగా  తన  శృంగార సన్నివేశాల  గురించి  కృతి శెట్టి పెదవి విప్పింది. 

    Vaishnav Tej and Krithi Shetty

     

    శృంగారం అనేది  సంప్రదాయం లాంటిది అని,  అందుకే  పాత్ర డిమాండ్ చేస్తే  బోల్డ్ సీన్స్  లో నటించడానికి తనకు అసలు మొహమాటం లేదు అని  కృతి పాప క్లారిటీ ఇచ్చింది. మొత్తమ్మీద  తన మాటలతో  కూడా   కృతి   యువతను గిలిగింతలు పెడుతుంది.   ఉప్పెనలో బోల్డ్ గా  నటించినా ఈ బ్యూటీ,  శ్యామ్ సింగరాయ్ లోనూ  లిప్ లాక్ ఇచ్చింది. అయితే, ఇప్పుడు సుదీర్ బాబుతో చేస్తున్న సినిమాలోనూ  కృతి శెట్టి ఒక లిప్ లాక్ ఇచ్చిందట.  మొత్తానికి కృతికి లిప్ లాక్ లు బాగా అలవాటు అయినట్టు ఉన్నాయి.