Actress Gayatri Bhargavi: సీనియర్ యాంకర్, సినీ నటి గాయత్రి భార్గవి ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమ పై కోపంగా ఉన్నారట. ఆ కోపానికి కారణం.. తానూ మంచి యాంకర్ అని.. అలాగే మంచి నటిని కూడా అని.. అయినా అవకాశాలు మాత్రం తనకు తగినట్టు రావడం లేదని ఆమె ఫీల్ అవుతుందట. హీరోయిన్ రేంజ్ గ్లామర్ తనలో ఉన్నా… తనను ఇప్పటికీ చిన్నాచితకా పాత్రలకు మాత్రమే పరిమితం చేశారనే అసంతృప్తి ఆమెకు ఎక్కువగా ఉందట.

తనను కేవలం చిన్న నటిగానే చూస్తున్నారని, అలాగే చిన్న యాంకర్ గానే చూస్తున్నారని గాయత్రి భార్గవి తెగ ఇదైపోతుంది. ఎంత గొప్ప టాలెంట్ ఉన్నా కెరీర్లో ఎప్పుడో ఒకసారి డల్ ఫేజ్ చూడాల్సిందే అని సన్నిహితులు ఆమెకు సర్ది చెబుతున్నా ఆమె శాతించట్లేదట. నాకెందుకు అవకాశాలు ఇవ్వరు ? నాకేం తక్కువ ? నేను అనసూయ కంటే బాగుంటాను కదా ? అంటూ విరుచుకుపడుతుందట. తనకు ఈ మధ్య టీవీ షోలలో కూడా సరైన అవకాశాలు రావడం లేదని ఆమె చేస్తోన్న ప్రధాన ఆరోపణ.
నిజానికి గాయత్రి భార్గవి ఎప్పటినుంచో ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ మొదటి నుంచి ఆమెకు సినిమాల్లో చెప్పుకోదగ్గ ఆఫర్లు రాలేదు. ఒకటి రెండు సినిమాల్లో కాస్త గుర్తింపు ఉన్న పాత్రల్లో నటించినా అవేవీ ఆమె కెరీర్ కు ఉపయోగపడలేదు. అందుకే ఆమెకు ఇండస్ట్రీ మీద ఇంట్రస్ట్ పోతుందని బాధ పడుతుంది. అయితే ఇక నుండైనా తను మూవీస్ లో బిజీ కావాలని తెగ ఆరాట పడుతుంది.
Also Read: Romantic: ‘రొమాంటిక్’ లో రామ్ మాస్ స్టెప్పులు అదిరిపోయాయి !
ఏది ఏమైనా ఆమె బాధలో అర్ధం ఉంది. ఆమె కంటే టాలెంట్ తక్కువ ఉన్న వారు కూడా చక్కగా కెరీర్ లో మంచి అవకాశలను అందిపుచ్చుకుంటుంటే.. ఆమె మాత్రం ఇంకా సరైన ఛాన్స్ అంటూ ఎదురుచూడటం బాధాకరమైన విషయమే. వెండితెరైనా బుల్లితెరైనా గాయత్రి భార్గవి బాగా రాణించగలదు. కాకపోతే ఎప్పుడూ లైమ్ లైట్ లో ఉండటానికి ఆమె సరిగ్గా ప్రయత్నాలు చేయదు. ఆ విషయంలో ఆమె అందర్నీ ఆకట్టుకుంటే అవకాశాలు వస్తాయి.
Also Read: Radhe Shyam: ప్రపంచప్రఖ్యాత జ్యోతిష్కుడు చెయిరోగా ప్రభాస్.. కొత్త కోణంలో అంటూ టాక్..