Avika Gor: చిన్నారి పెళ్లికూతురు సీరియల్ లో ఆనంది పాత్రలో ఒదిగిన నటి అవికా గోర్. తన అందంతో ప్రేక్షకులను మత్తెక్కిస్తోంది. అందుకే వరుస సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఆమె నటనకు తెలుగువారు కూడా ఫిదా అయిపోయారు. ఇక కొద్ది కాలంగా టాలీవుడ్ కు దూరంగా ఉంటూ బాలీవుడ్ లో అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది. ఉయ్యాల జంపాల చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె అనతి కాలంలోనే ప్రేక్షకులను అలరించింది. తన అందంతో మంత్రముగ్దులను చేసింది. కుర్రకారును రెచ్చగొట్టింది.

తరువాత లక్ష్మీ రావే మా ఇంటికి, సినిమా చూపిస్త మావ, ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాలు చేసింది. తక్కువ సినిమాలు చేసినా ఎక్కువ గుర్తింపు తెచ్చుకుంది. ప్రైవేటు సాంగ్స్, ఆల్బమ్స్ లో నటిస్తూ వస్తోంది. కాలాన్ని ఎంజాయ్ చేస్తోంది. ఇటీవల నాగచైతన్య, రాశీఖన్నా జంటగా వస్తున్న థ్యాంక్యూ చిత్రంలో కూడా కనిపించబోతోంది. దీంతో అవికా గోర్ తన ప్రస్థానాన్ని మళ్లీ మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. వరుసగా సినిమాలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. చిన్నారి పెళ్లికూతురు సీరియల్ చిన్నారి ఆనందిగా అందరిని అలరించింది.
Also Read: Anasuya Bharadwaj: జబర్దస్త్ నుంచి వెళ్లిపోతున్నా కన్నీరు కార్చని అనసూయ.. కారణమేంటి?
అవికా గోర్ సామాజిక మాధ్యమాల్లో మాత్రం బిజీగానే ఉంటోంది. ఎప్పుడు తన ఫొటోలు షేర్ చేస్తూ అభిమానులకు ఆనందాలు పంచుతూనే ఉంది. హాట్ ఫొటోలు పోస్టు చేస్తూ ప్రేక్షకుల్లో మతులు పోగొడుతోంది. ఆమె అందాలకు అందరు బందీలవుతున్నారు. తన ఫొటోలు చూస్తూ ఆస్వాదిస్తున్నారు. ఆమె తాజాగా బికినీలో ఉన్న ఫొటోలను షేర్ చేయడంతో అభిమానులకు కనుల పండుగ అవుతోంది. ఇంకా తన నడుము అందాలను చూపిస్తూ ఆమె పెట్టిన ఫొటోలకు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వస్తోంది.

ఇటీవల నవీన్ చంద్రతో కలిసి బ్రో సినిమాలో నటిస్తోంది. ఇది మరాఠీలో హ్యాపీ జర్నీకి రీమేక్ గా వస్తోంది. దీంతో అవికా గోర్ మరోమారు ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఖాయంగానే కనిపిస్తోంది. అవికా గోర్ హైదరాబాద్ కు చెందిన మిలింద్ చంద్వానీతో ప్రేమాయణం సాగిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీన్ని ఆమె కూడా ధ్రువీకరించింది. తాను ప్రేమలో ఉన్నట్లు వెల్లడించింది. దీంతో అవికా గోర్ టాలీవుడ్ లోనే మరోమారు టాలెంట్ చూపించుకుని మంచి పేరు తెచ్చుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read:Nithya Menen: నిత్యా మీనన్ పెళ్లి.. నిజం చెప్పేసిన కేరళ కుట్టి
Recommended Videos