Sandeep Reddy Vanga: రామ్ గోపాల్ వర్మ తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీలో అంత గొప్ప ఇమేజ్ ను సంపాదించుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగ… అతను చేసిన ‘అర్జున్ రెడ్డి’ సినిమా చాలామందికి ఇన్స్పిరేషన్ గా నిలిచింది. ఆ తర్వాత అర్జున్ రెడ్డి సినిమా బాటలోనే చాలా సినిమాలు తెరకెక్కాయి. వాటిలో కొన్ని సక్సెస్ సాధిస్తే మరి కొన్ని ఫెయిల్యూర్స్ గా నిలిచాయి. మొత్తానికైతే అర్జున్ రెడ్డి సినిమా ఒక క్లాసికల్ మూవీ అనే చెప్పాలి. ఆ సినిమా విషయంలో సందీప్ మొదటి నుంచి కూడా చాలా కేర్ ఫుల్ గా వ్యవహరిస్తూ వచ్చాడు. అందువల్ల అతనికి ఆ సక్సెస్ దక్కింది. ప్రతి చిన్న విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకొని క్లారిటీగా ఉంటూ ప్రతి సీన్ ను చాలా గొప్పగా డిజైన్ చేయించుకున్నాడు. సినిమా అంటే అంత పిచ్చి ఉంది కాబట్టే ఆయన ఆ సినిమాని చాలా గొప్పగా మలిచారు.
Also Read: రాజమౌళి.. ఏంటి మెంటల్ టెన్షన్? చావగొడుతున్నావ్ కదా…
ఇక సందీప్ రెడ్డివంగా ఒక నటుడిని కొట్టాడని అతని చేతిలో దెబ్బలు తిన్న ఆ నటుడు ఆ తర్వాత చాలా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడని మరి కొంతమంది చెబుతున్నారు. ఇంతకీ ఆ నటుడు ఎవరు అంటే రాహుల్ రామకృష్ణగా తెలుస్తోంది. అర్జున్ రెడ్డి సినిమా సమయంలో రాహుల్ రామకృష్ణ సందీప్ చెప్పినట్టుగా కాకుండా కొంచెం డిఫరెంట్ గా యాక్టింగ్ చేయడానికి ట్రై చేశారట.
వెంటనే సందీప్ వెనకాల నుంచి వచ్చి తన తల మీద ఒక దెబ్బ కొట్టి నువ్వు అలా చేయకు అంటూ అతనికి ఆ సీన్ లో ఉన్న డెప్త్ ను వివరించి తను గొప్పగా నటించేలా చేశాడట. ఇంతకీ ఆ సీన్ ఏంటి అంటే ఇంటర్వెల్ లో హీరోయిన్ కి పెళ్లి అవుతున్నప్పుడు హీరో వెళ్లి ఆ పెళ్లిని ఆపాలని చూస్తుంటే రాహుల్ రామకృష్ణ ఎమోషనల్ గా కొన్ని డైలాగులు చెబుతూ ఒక సీన్ చేస్తాడు. ఆ ఎమోషన్ ని పండించడంలో రాహుల్ రామకృష్ణ కొంతవరకు తడబడితే విసిగిపోయిన సందీప్ రెడ్డివంగా అతన్ని కొట్టి క్లారిటీగా చెప్పినట్టుగా తెలుస్తోంది.
ఆయన కొట్టడం కూడా చాలా ఫన్నీగా కొట్టినట్టుగా తెలుస్తోంది. ఇక సినిమాకి ముందు నుంచే వీళ్ళందరూ మంచి ఫ్రెండ్స్ కావడం వల్ల వాళ్ల మధ్య షూట్ సమయంలో అలాంటి ఫన్నీ ఇన్సిడెంట్స్ చాలా జరిగాయని ఒకానొక సందర్భంలో సందీప్ రెడ్డివంగా చెప్పడం విశేషం…