Homeఎంటర్టైన్మెంట్Vishal gift to CM Vijay: సీఎం విజయ్ కి తమిళ హీరో విశాల్ అరుదైన...

Vishal gift to CM Vijay: సీఎం విజయ్ కి తమిళ హీరో విశాల్ అరుదైన కానుక.. ఇలాంటి గిఫ్ట్ ఇప్పటి వరకు ఎవ్వరూ ఇవ్వలేదు..

Vishal gift to CM Vijay: తెలుగు , తమిళం భాషల్లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్న హీరోల్లో ఒకరు విశాల్. ఒకప్పుడు ఈయన సినిమాలకు మన టాలీవుడ్ లో ఉండే డిమాండ్ ఎలాంటిదో కళ్లారా చూసాము. ముఖ్యంగా మాస్ సెంటర్స్ లో ఇతగాడికి మన టాలీవుడ్ స్టార్ హీరోలతో సమానమైన ఓపెనింగ్ వసూళ్లు వచ్చేవి. ఇప్పటికీ ఏదైనా సూపర్ హిట్ సినిమా ఈయనకు తగిలితే , మన తెలుగు రాష్ట్రాల నుండి అవలీలగా 50 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వస్తాయి. అంతటి సత్తా ఉంది. ఇదంతా పక్కన పెడితే హీరో విశాల్ కి సామజిక స్పృహ కూడా ఎక్కువ. ఎల్లప్పుడూ తనకు తోచినంత సహాయం చేయడం లో ఎప్పుడూ ముందు ఉంటాడు. ఇతను చేసే సేవా కార్యక్రమాలు చూసి, భవిష్యత్తులో ఈయన రాజకీయాల్లోకి వచ్చే ఆలోచనలో ఉన్నాడు , అందుకే ఇలాంటి పనులు చేస్తున్నాడు అనేవారు కొంతమంది.

కానీ అలాంటిదేమి జరగలేదు , తన సినిమాలు తాను చేసుకుంటూ మధ్యలో సేవా కార్యక్రమాలు చేస్తుంటాడు. నేడు ఆయన తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ని కలిసి ఒక అరుదైన బహుమతి ఇచ్చాడు. దేశంలో ఇప్పటి వరకు ఎవ్వరూ కూడా ఇలాంటి బహుమతి ముఖ్యమంత్రులకు ఇవ్వలేదు. ఇంతకీ ఆయన ఇచ్చిన బహుమతి మరేదో కాదు విద్యాదానం. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ మంచి మార్కులు తెచ్చుకొని ఆర్థికంగా వెనకబడి ఉన్నటువంటి ముగ్గురు విద్యార్థులకు తన సొంత డబ్బులతో స్కాలర్ షిప్ ఇస్తున్నట్టు విజయ్ కి ఒక లేఖ ఇచ్చాడు. ముఖ్యమంత్రి ని కలిసినప్పుడు పూల బొకేలు , శాలువాలు ఇవ్వడం కంటే విద్యాదానం చేయడం ఎంతో గొప్ప పని అని ఆయన ఈ సందర్భంగా చెప్పకనే చెప్పాడు. ఒక బొకే కొద్దీ రోజులు మాత్రమే ఉంటుంది. కానీ ఒక చిన్నారి విద్య జీవితాంతం ఉపయోగపడుతుంది అనే సందేశాన్ని తన ట్విట్టర్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు విశాల్.

ఆయన చూపించిన ఈ చొరవకు సోషల్ మీడియా లో నెటిజెన్స్ ఫిదా అయ్యారు. అందరూ విశాల్ లాగా అలోచించి ముందుకు వెళ్తే, ఈ దేశం లో ప్రతిభ గల పేద విద్యార్థి ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు అంటూ సోషల్ మీడియా లో ఈ సందర్భంగా నెటిజెన్స్ చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం ఆయన హీరో గా మకుటం అనే చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమాకు ఆయన దర్శకుడు గా కూడా వ్యవహరిస్తున్నాడు. రీసెంట్ గానే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ని విడుదల చేయగా, దానికి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. విశాల్ ఈ చిత్రం తో భారీ కం బ్యాక్ ఇచేలా ఉన్నాడని సోషల్ మీడియా లో ప్రతీ ఒక్కరు కామెంట్స్ చేస్తున్నారు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version