Uttej wife Padmavati: తెలుగు సినీ పరిశ్రమలో వరుస విషాదకరమైన సంఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఇప్పటికే ఈ కరోనా కాలంలో కొందరు సినీ ప్రముఖులు చనిపోయారు. ప్రముఖ నటుడు, రచయిత ఉత్తేజ్ సతీమణి పద్మావతి మృతి చెందారు. గత కొంతకాలంగా ఆమె క్యాన్సర్ మహమ్మారితో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.
అయితే, ఆమె అనారోగ్యంతో చికిత్స పొందుతూ బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో ఈ రోజు కన్ను మూశారు. కొద్ది రోజులుగా క్యాన్సర్ చికిత్స తీసుకుంటున్న ఆమె ఆరోగ్య పరిస్థితి విషయమించడంతో వెంటిలేటర్ పై చికిత్స అందించినా ప్రయోజనం లేకుండా పోయింది. తన భార్య మరణం పట్ల స్పందిస్తూ ఉత్తేజ్ ఎమోషనల్ అయ్యారు.
ఆయన ఆమెతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఇక ఆమె లేరు అన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని ఆయన చెప్పారు. పద్మావతి మృతి పట్ల సినీ ప్రముఖులు కూడా తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.
మా ‘ఓకేతెలుగు.కామ్’ తరఫున పద్మావతి మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, శోహార్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము.