Actor Suriya Daughter Diya: సౌత్ ఇండియా లో మోస్ట్ క్రేజీ హీరోలలో ఒకరు సూర్య..ఈయనకి తమిళనాడు లో ఎలాంటి క్రేజ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..అక్కడి టాప్ 3 స్టార్ హీరోలలో సూర్య కూడా ఒకడు..ఈయనకి ఒక్క తమిళనాడు లో మాత్రమే కాదురెండు తెలుగు రాష్ట్రాల్లో మరియు కేరళలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది..ఒక్క మాటలో చెప్పాలంటే సౌత్ ఇండియా లో రజినీకాంత్ మరియు కమల్ హాసన్ తర్వాత అంతటి మార్కెట్ ఉన్న ఏకైక హీరో సూర్య మాత్రమే..అయితే గత కొంత కాలం నుండి ఆయన సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్నాడు.

ఇటీవలే భారీ అంచనాల నడుమ విడుదలైన ET కూడా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది..అయితే ఇటీవలే విడుదలైన కమల్ హాసన్ విక్రమ్ సినిమా లో ‘రోలెక్స్’ అనే అతిధి పాత్ర పోసించి తక్కువ నిడివి ఉన్న పాత్రతోనే సంచలనం సృష్టించాడు..విక్రమ్ కలెక్షన్స్ నేడు ఈ స్థాయిలో రావడానికి ప్రధాన కారణాలలో ఒకటి రోలెక్స్ పాత్ర..ప్రస్తుతం ఆయన కోలీవుడ్ టాప్ డైరెక్టర్ వెట్రిమారన్ తో వాడి వాసల్ అనే సినిమా చేస్తున్నాడు..ఈ సినిమా మీద ఆయన అభిమానులు కోటి ఆశలు పెట్టుకున్నారు.
Also Read: Naresh and Pavithra Lokesh: నరేశ్, పవిత్రలు విడాకులు తీసుకున్నాకే పెళ్లి..!

ఇక సూర్య గారు తానూ స్థాపించిన ఆగారం ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవ కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు..ఈ ఫౌండేషన్ ద్వారా ఆయన ఎంతో మంది అనాధ పిల్లలకు చదువు చెప్పించాడు..అలాగే ఎన్నో వందల మందికి ఆయన ఉచితంగా వైద్యం కూడా చేయించి ఉన్నాడు..ఇది పక్కన పెడితే సూర్య మరియు జ్యోతిక దంపతులకు దియా అనే కూతురు ఉన్న సంగతి మన అందరికి తెలిసిందే..ఈ అమ్మాయి ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది..అసలు విషయానికి వస్తే ఇటీవలే తమిళనాడు లో పదవ తరగతి ఫలితాలు వచ్చాయి..ఈ ఫలితాలలో దియా కి 500 మార్కులకు గాను 487 మార్కులు వచ్చాయి..ఆమె స్కూల్ కి దియా నే ఫస్ట్ రాంక్ అట..ఇలా తన కూతురు అద్భుతమైన మార్కులను సంపాదించినందుకు సూర్య మరియు జ్యోతికల ఆనందానికి హద్దులే లేకుండా పోయిండట..సోషల్ మీడియా లో సూర్య అభిమానులు కూడా ఈ వార్త తెగ షేర్ చేస్తున్నారు.
Recommended Videos
[…] Also Read: Actor Suriya Daughter Diya: చిన్న వయస్సులోనే ప్రభంజనం … […]