Homeఎంటర్టైన్మెంట్Sree Vishnu: ఎన్టీఆర్ అభిమానిగా "అర్జున ఫల్గుణ" సినిమాలో శ్రీవిష్ణు... టీజర్ ఎప్పుడంటే

Sree Vishnu: ఎన్టీఆర్ అభిమానిగా “అర్జున ఫల్గుణ” సినిమాలో శ్రీవిష్ణు… టీజర్ ఎప్పుడంటే

Sree Vishnu: వైవిధ్యభరిత చిత్రాలు తీస్తూ టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు యంగ్ హీరో శ్రీవిష్ణు. ఇటీవల కాలంలో పలు సినిమాలతో మంచి సక్సెస్ అందుకొని ఈ యంగ్ హీరో ఫుల్ ఫామ్ లో ఉన్నాడని చెప్పాలి. ఆయన నటించిన బ్రోచేవారెవరురా, రాజ రాజ చోర చిత్రాలు మంచి హిట్ సాధించడంతో శ్రీ విష్ణు తదుపరి మూవీ లపై ఆసక్తి నెలకొంది.

actor sree vishnuacting as a jr ntr fan in arjuna phalguna movie

ఆయన తాజాగా నటిస్తున్న చిత్రం “అర్జున ఫల్గుణ”. తేజ మ‌ర్ని ద‌ర్శ‌క‌త్వంలో మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. శ్రీ విష్ణు సరసన ఈ సినిమాలో అమ్రిత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తుంది. అయితే తాజాగా ఈ మూవీ గురించి ఓ ఆసక్తికర అప్డేట్ ను మూవీ యూనిట్ ప్రకటించింది. నవంబర్ 9న ఈ సినిమా టీజర్ ని రిలీజ్ చేస్తున్నట్టుగా ఓ ఇంట్రెస్టింగ్ పోస్టర్ ను శ్రీ విష్ణు రిలీజ్ చేశారు. ఈ సినిమాలో శ్రీ విష్ణు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి వీరాభిమానిగా నటిస్తున్నాడు.

మాస్ ఆడియన్స్ లో ఎన్టీఆర్ కి ఉన్న ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి తారక్ కి అభిమానిగా  శ్రీ విష్ణు నటిస్తుండడంతో మూవీపై అంచనాలు పెరిగాయి. ఈ పోస్టర్ లో  శ్రీ విష్ణు చేతికి రక్తంతో తడిచిన కర్చీఫ్ దానిపై ఎన్టీఆర్ అనే పేరు ఉంది. ఇక ఈ పోస్టర్ చూస్తుంటే తారక్ అభిమానులకు మూవీ లో మంచి ట్రీట్ రెడీగా ఉన్నట్టు అర్ధం అవుతుంది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Most Popular

Varanasi Teaser: ‘వారణాసి’ టీజర్ విషయంలో కంగారు పడుతున్న రాజమౌళి… వస్తుందా రావట్లేదా… ..

Varanasi Teaser: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో భారీ విజయాలను సాధిస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న నటులు చాలామంది ఉన్నారు. రాజమౌళి లాంటి దర్శకుడు...

Monsoon Health Tips: వర్షాకాలంలో ఈ టీ తీసుకుంటే రోగాలకు దూరం ఉన్నట్లే..

Monsoon Health Tips: వర్షాకాలంలో వాతావరణంలో తేమ పెరగడం, నీరు, ఆహారం కలుషితం అవుతూ ఉంటుంది. ఈ క్రమంలో వైరల్ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశాలుండడం వల్ల జలుబు, దగ్గు, గొంతునొప్పి,...

Furniture Rental: ఇల్లు మారుతున్నారా? ఇక ఇంటి సామగ్రి కొనాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే..

Furniture Rental: కొత్తగా ఉద్యోగంలో చేరిన చేరిన వారు.. రకరకాల కారణాల వల్ల నిత్యం నగరాలకు వలస వెళ్లే వారికి ఇంటి సామగ్రిని సమకూర్చుకోవడం పెద్ద ప్రయాసే. అద్దె ఇల్లు అయినా...

Today 22 July 2026 Horoscope: ఈ రాశుల వారి ఆదాయం ఈరోజు రెండింతలు.. ఏ పని...

Today 22 july 2026 horoscope : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధవారం ద్వాదశ రాశులపై విశాఖ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు తులా రాశిలో సంచారం చేయనున్నాడు. దీంతో కొన్ని...

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...
Oktelugu Epaper
Exit mobile version