HBD Sonu Sood: నటుడు సోనూ సూద్ జన్మదినం నేడు. 1973 జులై 30న పంజాబ్ రాష్ట్రంలో పుట్టిన సోనూ సూద్ 50వ ఏట అడుగుపెట్టాడు. ఆయన జన్మదినం సందర్భంగా కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. సోనూ సూద్ చదువు పూర్తి అయ్యాక నటన వైపు అడుగులు వేశారు. 1999లో విడుదలైన కల్లజఘర్ అనే తమిళ మూవీతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అయ్యాడు. తెలుగులో సోనూ సూద్ మొదటి చిత్రం హ్యాండ్స్ అప్. హిందీ, తెలుగు భాషల్లో సోనూ సూద్ ఎక్కువగా చిత్రాలు చేశారు.
Also Read: కల్కి సినిమా కి ఇంత క్రేజ్ ఏంటి భయ్య…నెల గడిచిన కూడా కలెక్షన్ల వర్షం కురిపిస్తుందిగా…
2005లో దర్శకుడు పూరి జగన్నాధ్ తెరకెక్కించిన సూపర్ లో సోనూ సూద్ సెకండ్ హీరోగా చేయడం విశేషం. నాగార్జునతో సమానమైన పాత్ర సోనూ సూద్ కి దక్కింది. మహేష్ బాబు అతడు చిత్రంలో కూడా సోనూ సూద్ ఓ పవర్ ఫుల్ రోల్ చేశాడు. ఇక అరుంధతి చిత్రంతో సోనూ సూద్ టాలీవుడ్ టాప్ విలన్ రేసులోకి దూసుకొచ్చాడు. అరుంధతి చిత్రంలోని నటనకు సోనూ సూద్ నంది అవార్డు అందుకున్నారు. అరుంధతి బ్లాక్ బస్టర్ సాధించింది.
25 ఏళ్ల కెరీర్లో సోనూ సూద్ 100 కి పైగా చిత్రాల్లో నటించాడు. సోనూ సూద్ నటుడిగానే ప్రేక్షకులకు తెలుసు. అతనిలోని సేవా గుణం కోవిడ్ సమయంలో బయటపడింది. లాక్ డౌన్ కారణంగా నగరాల్లో చిక్కుకుపోయిన కూలీలు తమ సొంత ఊళ్లకు వెళ్లేందుకు సోనూ సూద్ తన డబ్బులతో వాహనాలు, ప్రత్యేకమైన రైళ్లు ఏర్పాటు చేశాడు. సోషల్ మీడియా వేదికగా వేడుకున్న అనేక మంది పేదవారికి ఆర్థిక సహాయం అందించారు. రైతులకు ట్రాక్టర్లు సమకూర్చాడు.
గత నాలుగేళ్లలో సోనూ సూద్ వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా సహాయం చేశాడు. సోనూ సూద్ కలియుగ కర్ణుడు అయ్యాడు. తెలుగు రాష్ట్రాల్లో కూడా అనేక మంది సోనూ సూద్ సేవలు పొందారు. కోరికలో నిజాయితీ ఉంటే సోనూ సూద్ వెంటనే తీర్చేస్తాడు. వేల మందికి కోట్లు దానం చేస్తున్న సోనూ సూద్ ఆస్తి విలువ ఎంత? ఆయన సినిమాకు ఎంత తీసుకుంటాడు అనే ఆసక్తి అందరిలో ఉంది.
సోనూ సూద్ కి ఒక ప్రొడక్షన్ హౌస్ ఉంది. దాని పేరు శక్తి సాగర్. ఈ బ్యానర్ పై ఆయన సినిమాలు నిర్మిస్తారు. అలాగే ఎక్స్ పల్గర్ అనే ట్రావెల్ సోషల్ మీడియా ఫ్లాట్ ఫార్మ్ కి సోనూ సూద్ సహ వ్యవస్థాపకుడు. ముంబై అంధేరి ప్రాంతంలో సోనూ సూద్ కి 2600 స్క్వేర్ ఫీట్ లగ్జరీ ఫ్లాట్ ఉంది. అలాగే మరొక ఫ్యామిలీ హౌస్, హోటల్ ముంబైలో ఉన్నాయి. సోనూ సూద్ కి ప్రధాన ఆదాయ వనరులు యాక్టింగ్, రియల్ ఎస్టేట్, బ్రాండ్ ప్రమోషన్స్.
సోనూ సూద్ సినిమాకు రూ. 2 కోట్లు తీసుకుంటాడని సమాచారం. ఆయన వద్ద పోర్చే తో పాటు మరికొన్ని లగ్జరీ కార్లు ఉన్నాయి. మొత్తంగా సోనూ సూద్ ఆస్తుల విలువ రూ. 130 కోట్లు అని ఒక అంచనా. మరొక విశేషం ఏమిటంటే సోనూ సూద్ భార్య తెలుగు అమ్మాయి. వీరికి ఇద్దరు అబ్బాయిలు సంతానం.
Also Read: రాజాసాబ్ గ్లింప్స్ లో ప్రభాస్ లుక్ బాగుంది…కానీ మారుతి ఆ ఒక్క మిస్టేక్ చేయకుండా ఉంటే బాగుండేది…
Web Title: Actor sonu sood birthday special know his net worth
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com