Bigg Boss 4: This time their domination
ఇండియన్ బిగెస్ట్ రియాలిటీ షోగా బిగ్ బాస్ హడావుడి ప్రస్తుతం తెలుగు బుల్లితెర పై పీక్స్ లో ఉంది. కరోనా కష్ట కాలంలో అలిసిపోయిన ఆడియన్స్ కి ఎంటర్ టైన్మెంట్ అందివ్వడానికి కింగ్ నాగార్జున గ్రాండ్ గా బిగ్ బాస్ తెలుగు నాలుగవ సీజన్ ని స్టార్ట్ చేశారు. పైగా గత మూడు సీజన్లో లేని విధంగా షోను చాలా కలర్ఫుల్ గా తీర్చిదిద్దారు ఈ సారి. అందుకే బిగ్ బాస్ షో ఈ సారి ఊహించని రేటింగ్ అందుకొంటూ ముందుకు పోతుంది. దీనికి తోడు షోలోకి వచ్చిన కంటెస్టెంట్స్ కూడా ఎవరికి వారు తమకంటూ ప్రత్యేకమైన క్రేజ్ అందుకుంటూ రోజురోజుకూ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటున్నారు.
Also Read: మోనాల్, సుజాతలతో అవినాష్ పులిహోర ట్రాక్స్ !
మొత్తం 16మంది కంటెస్టెంట్స్ తో 105రోజుల పాటు కొనసాగనున్న ఈ షోలో కొంతమంది ఎలిమినేట్ అవుతుండగా.. మరికొంతమంది వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌజ్ లోకి వస్తున్నారు. కాగా ప్రస్తుతం మరో ప్లాప్ హీరో కూడా హౌజ్ లోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అప్పట్లో హీరోగా రెండు మూడు హిట్లు అందుకున్న ‘హీరో రోహిత్’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. మెయిన్ లిస్ట్ లో గానీ, ఆ తరువాత వినిపించిన పేరుల్లో గానీ రోహిత్ పేరు ఎప్పుడూ వినిపించలేదు. మరి ఇప్పుడు సడెన్ గా అతని పేరు రేసులోకి వచ్చింది. దాంతో అతను ఎంట్రీ ఉండాల్సిందే అని నెటిజన్లు కామెంట్స్ కూడా పెడుతున్నారు. ఈ మధ్య ఇచ్చిన ఓ ఇంటర్వ్యూతో అతను మళ్ళీ ఫేమ్ లోకి వచ్చాడు.
Also Read: సుశాంత్ రూ.12కోట్లు అడిగాడు.. ఎందుకంటే?
అయితే షోకి అనుకున్నట్టుగానే వీకెండ్స్ లో మంచి రేటింగ్ వస్తోంది. కానీ, క్రమేణా ఇంటిలో సభ్యులలో కొంతమంది ప్రేక్షకులకు అంతగా ముఖ పరిచయం లేనివారు కావటంతో వీక్ డేస్ లో రేటింగ్ తగ్గుతూ వస్తుందట. మరోవైపు ఐపీఎల్ కూడా ప్రారంభం కావడంతో ప్రేక్షకులు బిగ్ బాస్ కు కాస్త దూరం జరిగారని తెలుస్తోంది. అందుకే బుల్లితెర ప్రేక్షకులను మళ్లీ తమ వైపు తిప్పుకునేందుకు మరో వైల్డ్ కార్డ్ ఎంట్రీ కి రంగం సిద్ధం చేశారు బిగ్ బాస్ నిర్వాహకులు. ఈ నేపథ్యంలోనే జంప్ జిలానీ హీరోయిన్ స్వాతి దీక్షితే ను హౌస్ లోకి పంపించబోతునట్లు నిన్నటివరకూ సోషల్ మీడియాలో ఓ వార్త బాగా హాల్ చల్ చేసింది. ఇప్పుడు మాజీ హీరో రోహిత్ పేరు కూడా వినిపిస్తోంది. మరి వీరిద్దరిలో ఎవరు హౌస్ లోకి వెళ్తారో చూడాలి.