Actor Robo Shankar Passed Away: సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటి ని క్రియేట్ చేసుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక తమిళ్ ఇండస్ట్రీలో ఎంతమంది నటులు ఉన్నప్పటికి అక్కడ కొంతమందికి మాత్రమే చాలా మంచి గుర్తింపైతే వస్తోంది. ఇలాంటి క్రమంలోనే రోబో శంకర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు గురువారం రోజు అనారోగ్య కారణం చేత మరణించినట్టుగా వైద్యులైతే వెల్లడించారు. ఇక ఆయన గత రెండు రోజుల క్రితం ఒక సినిమా షూటింగ్లో పాల్గొన్నప్పుడు అక్కడ స్పృహ తప్పి పడిపోవడంతో హుటాహుటిన అతన్ని హాస్పిటల్ కి తీసుకెళ్లారు. ఇక ట్రీట్మెంట్ ని అందించిన వైద్యులు అతని ఆరోగ్య పరిస్థితి విషమించడం తో గురువారం మరణించినట్టుగా ధ్రువీకరించారు. మరి ఏది ఏమైనా కూడా కెరియర్ స్టార్టింగ్ లో ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేసుకుంటున్న రోబో శంకర్ రోబోల యాక్ట్ చేయడం, మిమిక్రీ చేయడం లాంటివి చేసి బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితుడు అయ్యాడు. ఇక ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి విశ్వాసం, పులి, సింగం 3, కోబ్రా లాంటి తదితర చిత్రాల్లో నటించి తనకంటూ నటుడిగా ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు… ఇక తన మృతి పట్ల ప్రముఖ నటుడు అయిన కమల్ హాసన్ సంతాపాన్ని తెలియజేశాడు.
ఇక ఇతనితో పాటుగా మరి కొంతమంది రాజకీయ, సినీ ప్రముఖులు సైతం సంతాపాన్ని తెలియజేయడం విశేషం… అయితే రోబో శంకర్ గత కొన్ని రోజుల నుంచి కామెర్ల వ్యాధితో ఇబ్బంది పడుతున్నట్టుగా తెలుస్తోంది. దాని వల్లే ఆయన ఆరోగ్యం విషమించి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు అంటూ వైద్యులు అయితే తెలియజేస్తున్నారు.
మరి ఏది ఏమైనా కూడా నటుడిగా మంచి పాపులారిటిని సంపాదించుకుంటున్న క్రమంలోనే ఇలా జరగడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం అనే చెప్పాలి. ఇక అతనికి భార్య, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు… ఏది ఏమైనా కూడా హెల్త్ పరంగా తగిన జాగ్రత్తలైతే తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది.
ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరుకి ఎలాంటి అనారోగ్యకరమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి అనేది తెలియడం లేదు. కాబట్టి ఎంత బిజీగా ఉన్నా కూడా హెల్త్ పట్ల అంతో ఇంతో జాగ్రత్తలు తీసుకుంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం అలాగే మన మనుగడ కూడా ముందుకు సాగుతోంది. లేకపోతే మాత్రం తీవ్రమైన అనారోగ్య పరిస్థితులు ఏర్పడే ప్రమాదాలు కూడా ఉన్నాయి…