Rajendra Prasad: టాలీవుడ్ లో ఇప్పటికే చాలా మంది సినీ ప్రముఖలను కరోనా మహమ్మారి అటాక్ చేసింది. తాజాగా టాలీవుడ్ కామెడీ స్టార్ హీరో రాజేంద్ర ప్రసాద్ ను కూడా కరోనా టాక్ చేసింది. ఆయనకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కావడంతో ఫ్యామిలీ మెంబర్స్ షాక్ అయ్యారు. వెంటనే ఆయనను హైదరాబాద్ లోని ఎఐపీ ఆస్పత్రిలో కుటుంబ సభ్యులు చేర్పించడం జరిగింది.

రాజేంద్ర ప్రసాద్ నిన్నటి నుంచి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆస్పత్రిలో రాజేంద్ర ప్రసాద్ కు చికిత్స అందిస్తున్నారు వైద్యులు. ఏది ఏమైనా కరోనా భయం మళ్ళీ మొదలైంది. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో కరోనా మూడో వేవ్ కేసులు కూడా వేగంగా పెరుగుతున్నాయి. అసలు కరోనా మూడో వేవ్ ఇంత వేగంగా వ్యాప్తి చెందుతుందని ఎవ్వరూ ఊహించకముందే వరుసగా కేసులు నమోదు అవుతున్నాయి.
Also Read: Rowdy Boys: ఆ హీరో సినిమాను టార్గెట్ చేసిన ‘రౌడీ బాయ్స్’..!
ప్రస్తుతం కరోనా సోకినా సినీ ప్రముఖుల లిస్ట్ భారీగానే ఉంది. మంచు లక్ష్మి, మహేష్ బాబు, మంచు మనోజ్, విశ్వక్ సేన్, థమన్, మీనా ఇలా చాలామంది ఉన్నారు. దాంతో సడెన్ గా షూటింగ్స్ కూడా ఆపుకోవాల్సి వస్తోంది. ఇప్పటికే, చాలా సినిమాలు మధ్యలోనే షెడ్యూల్స్ ను క్యాన్సిల్ చేసుకున్నాయి. ఇలాగే కేసులు పెరిగితే.. లాక్ డౌన్ పెట్టిన ఆశ్చర్యపోనక్కర్లేదు. అన్నట్టు కోలీవుడ్ ఇండస్ట్రీలోనూ తనకంటూ మంచి పేరు తెచ్చుకున్న హీరో విష్ణు విశాల్ కూడా కరోనా బారిన పడ్డాడు. షూటింగ్ స్పాట్స్ లో కరోనా వస్తే.. ఆ స్పాట్ లో ఉన్న వంద మందికి పైగా కరోనా సోకే అవకాశం ఉంది.
Also Read: Rana 1947 Movie: రానా ‘1945’ ఫస్ట్ డే కలెక్షన్స్.. రానా కెరీర్ లోనే బిగ్గెస్ట్ ప్లాప్ !