Mohanlal Mother Passes Away: మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్(Mohanlal) ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన తల్లి శాంతకుమారి(Santhakumari) (90 ఏళ్ళు) కాసేపటి క్రితమే కొచ్చి లో కన్నుమూశారు. ఆమె మృతి పట్ల ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ కి చెందిన సినీ ప్రముఖులంతా సంతాపం తెలిపారు. మోహన్ లాల్ కి ఈ కష్టమైన సమయం లో దేవుడు అండగా నిలబడాలని సానుభూతి వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా లో పోస్టులు వేస్తున్నారు. అయితే నేడు వైకుంఠ ఏకాదశి, ఈ శుభ దినం లో ఆమె తుది శ్వాస వదలడం నూటికో, కోటికో ఒక్కరు చేసుకున్న అదృష్టం అంటూ సోషల్ మీడియా లో కొంతమంది నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఆమె చేసిన పుణ్య కార్యాల వల్లే నేడు దేవుడు ఆమెని ఈ శుభ దినాన తన వద్దకు తీసుకెళ్లాడని మోహన్ లాల్ అభిమానులు అంటున్నారు.
మోహన్ లాల్ కి తన తల్లి తో ఉన్న అనుబంధం సాధారణమైనది కాదు. ఆమె పై తనకు ఉన్న ప్రేమని ఎన్నో సార్లు చాటుకున్నాడు. వీళ్ళ బంధానికి సంబంధించి అప్పుడప్పుడు ఆయన సోషల్ మీడియా లో అభిమానులతో కూడా షేర్ చేసుకుంటూ ఉండేవాడు. మోహన్ లాల్ కి దాదా సాహెబ్ పాల్కే అవార్డు వచ్చినప్పుడు, తన ఆనందాన్ని కొచ్చి కి వచ్చి మొట్టమొదట షేర్ చేసుకున్నది అమ్మతోనే అట. అంతే కాకుండా ఈ ఏడాది మదర్స్ డే సందర్భంగా చిన్నప్పుడు తన తల్లి తో కలిసి దిగిన ఫోటోలను కూడా పంచుకున్నాడు. శాంతకుమారి తన జీవితం లో ఎక్కువ శాతం తిరువనందపురం లోనే గడుపుతూ వచ్చింది. కానీ ఎప్పుడైతే ఆమె హార్ట్ అటాక్ వచ్చిందో, అప్పటి నుండి కొచ్చి లో తన కొడుకు మోహన్ లాల్ తో కలిసి ఉంటుంది. ఆగస్టు 10 వ , 2025 న ఆమె గ్రాండ్ గా 90 వ పుట్టిన రోజు వేడుకలను కూడా జరుపుకుంది.