Actor Lakshmipathi Son: తెలుగు సినిమా ఒకప్పుడు స్వర్ణయుగంలా ఉండేది. యాక్షన్, ఎమోషనల్, సెంటిమెంట్ తో పాటు కామెడీ చిత్రాలు అలరించేవి. మొన్నటి వరకు ప్రత్యేకంగా కామెడీ ఉండే సినిమాలను ఆడియన్స్ ఎక్కువగా ఆదరించేవారు. దీంతో ఆ సినిమాలతో పాటు అందులో నటించేవారికి ప్రత్యేకంగా గుర్తింపు ఉండేది. ఈ క్రమంలో ఒకరికి మించి మరొకరు అన్నట్లుగా చాలా మంది కమెడియన్లు ఇండస్ట్రీకి వచ్చారు. వీరిలో లక్ష్మీ పతి ఒకరు. టీవీ యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన లక్ష్మీపతి ఆ తరువాత పలు సినిమాల్లో నటించారు. గోదావరి యాస, వెటకారంతో నవ్వు తెప్పించే కామెడీ చేసి స్టార్ ఇమేజ్ తెచ్చుకున్నారు. అయితే సినిమాల్లో కొనసాగుతున్న సమయంలోనే లక్ష్మీపతి గుండె వ్యాధితో అకాల మరణం చెందారు. అయితే ఆయన కొడుకు ఇప్పుడు స్టార్ హీరో రేంజ్ కు వెళ్లాడు.
జంధ్యాల శిష్యుడైన ఈవీవీ సత్యనారాయణ ఫ్యామిలీ చిత్రాలతో పాటు కడుపుబ్బా నవ్వించే ఎన్నో హాస్య చిత్రాలను తీశారు. ఆయన కామెడీ సినిమాలో ప్రతీ ఒక్క హస్య నటుడు ఉంటారు. అయితే ఆయన కుమారుడు నరేష్ నటించిన ‘అల్లరి’ సినిమాతో తెరంగేట్రం చేశారు లక్ష్మీపతి. మొదటి సినిమాలోనే తనదైన కామెడీ చేసి ఆకట్టుకున్నారు. ఆ తరువాత పెదబాబు, , తొట్టి గ్యాంగ్, కితకితలు, అందాల రాముడు వంటి చిత్రాల్లో నటంచి స్టార్ ఇమేజ్ తెచ్చుకున్నారు.
సుమంత్ హీరోగా వచ్చిన ‘గోల్కోండ హైస్కూల్’ సినిమా క్రికెట్ నేపథ్యంలో రూపుదిద్దుకుంది. ఇందులో టీం కెప్టెన్ గా ఓ కుర్రాడు అలరిస్తాడు. అయన పేరు సంతోష్ శోభన్. అయితే ఈయన లక్ష్మీపతి సొంత కుమారుడు కాదు. తన తమ్ముడు శోభన్ కొడుకు. ఇక శోభన్ ఎవరో కాదు. లవ్ ఎమోషనల్ నేపథ్యంలో వచ్చిన వర్షం సినిమా డైరెక్టర్. ఆ తరువాత మహేష్ బాబుతో కలిసి ‘బాబీ’ సినిమా కూడా తీశారు. అయితే ఈ మూవీ అంతగా ఆకట్టుకోలేదు. కానీ ఇందులో లక్ష్మీపతికి నెగెటివ్ రోల్ ఇచ్చారు. తన అన్న అయినందువల్లే ఈ క్యారెక్టర్ ఇచ్చారని అప్పట్లో అనుకున్నారు.
సంతోష్ శోభన్ విషయానికొస్తే ‘పేపర్ బాయ్’ అనే సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. ఆ తరువాత ‘అన్నీ మంచి శకునములే’ అనే సినిమాతో అలరించారు. ఈ మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో స్టార్ ఇమేజ్ సొంతం చేసుకుంటారని అందరూ అనుకుంటున్నారు. ఈ సందర్భంగా సంతోష్ శోభన్, తన పెద్ద నాన్న లక్ష్మీపతితో కలిసి సోషల్ మీడియాలో పిక్స్ పెట్టి అలరిస్తున్నారు. పెద్ద నాన్న లాగే సంతోష్ శోభన్ కూడా మంచి పేరు తెచ్చుకోవాలని ఆశిస్తున్నారు.