spot_img
Homeఎంటర్టైన్మెంట్Daniel Balaji: ప్రముఖ సినీ నటుడి హఠాన్మరణం.. శోకసంద్రంలో సినీ పరిశ్రమ

Daniel Balaji: ప్రముఖ సినీ నటుడి హఠాన్మరణం.. శోకసంద్రంలో సినీ పరిశ్రమ

Daniel Balaji: నటుడు డేనియల్ బాలాజీ హఠన్మరణం పొందారు. చిత్ర పరిశ్రమలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలముకున్నాయి. ఆయన మరణానికి కారణం గుండెపోటు అని తెలుస్తుంది. 48 ఏళ్ల డేనియల్ బాలాజీ మరణాన్ని కుటుంబ సభ్యులు ధృవీకరించారు. శుక్రవారం రాత్రి డేనియల్ బాలాజీ గుండెపోటుకు గురయ్యారు. కుటుంబ సభ్యులు ఆయన్ని చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే డేనియల్ బాలాజీ మార్గం మధ్యలోనే కన్నుమూసినట్లు వైద్యులు వెల్లడించారు.

డేనియల్ బాలాజీ కెరీర్ ప్రొడక్షన్ మేనేజర్ గా మొదలైంది. దర్శకుడు కావాలని ఫిల్మ్ మేకింగ్ కోర్స్ చేశాడు. డేనియల్ బాలాజీ సీరియల్ నటుడిగా మారాడు. ఓ సీరియల్ లో చేసిన పాత్ర ఆధారంగా ఆయనకు డేనియల్ అనే స్క్రీన్ నేమ్ వచ్చింది. డానియల్ బాలాజీ తండ్రి తెలుగువాడు కాగా తల్లి తమిళ్. 2002లో సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అయ్యాడు.

దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ తో డేనియల్ బాలాజీకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆయన దర్శకత్వం వహించిన చిత్రాల్లో డేనియల్ బాలాజీ కీలక రోల్స్ చేశాడు. గౌతమ్ మీనన్ తెరకెక్కించిన వెట్టైయాడు వెలైయాడు చిత్రంలో సైకో కిల్లర్ గా అద్భుత నటనతో డేనియల్ బాలాజీ ఆకట్టుకున్నాడు. అప్పటి నుండి విలన్ గా సెటిల్ అయ్యాడు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో 50కి పైగా చిత్రాల్లో నటించాడు.

దర్శకుడు వివి వినాయక్ తెరకెక్కించిన సాంబ చిత్రంతో టాలీవుడ్ లో అడుగుపెట్టాడు. అలాగే వెంకటేష్-గౌతమ్ మీనన్ కాంబోలో వచ్చిన ఘర్షణ చిత్రంలో కీలక రోల్ చేశాడు. చిరుత, సాహసం శ్వాసగా సాగిపో చిత్రాల్లో ఆయన నటించారు. తెలుగులో డేనియల్ బాలాజీ చివరి చిత్రం టక్ జగదీశ్. నాని హీరోగా దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించాడు. డేనియల్ బాలాజీ మరణవార్త తెలిసిన చిత్ర ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular