Bandla Ganesh: తెలుగు సినీ పరిశ్రమలో కమెడియన్‌గా పరిచయం అయ్యి అందరిని తన కామెడీతో నవ్వించి ఇప్పుడు బడా నిర్మాతగా మారారు బండ్ల గణేష్. సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాతో బడా నిర్మాతల లిస్టులో తన పేరును చేర్చుకున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని గా సమాజంలోని అంశాల గురించి ఎప్పటికప్పుడు నిర్మొహమాటంగా ప్రశ్నించే గలిగే వ్యక్తిగా ఆయన నిలిచారు. అలానే ఆయన సొంత ఊళ్ళో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ… అప్పుడప్పుడు సోషల్ మీడియాలో సాయం అడిగిన కొందరికి తన వంతు సాయం అందిస్తారు బండ్ల గణేష్.

అయితే ఇటీవల తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఓ నేపాలీ పాపని పెంచుకుంటున్నట్టు తెలిపారు. ఓ రోజు నేను మా ఆవిడ ఒక చోటికి వెళ్తే అక్కడ పాప ఏడుస్తూ ఉందన్నారు. మా ఆవిడ వెళ్లి పాప వాళ్ల అమ్మని ఎందుకు ఏడుస్తుంది ఏమన్నా తినడానికి పెట్టండి అంటే ఆమె నా దగ్గర ఏమీ లేక కేవలం పాలు మాత్రమే పట్టాను అని చెప్పిందట. అప్పుడు నా భార్య అది చూసి… మనం ఈ పాపని పెంచుకుందామని చెప్పింది. నేను కూడా సరే అని చెప్పి పాపని పెంచుకుంటాము అని అడిగారంట గణేష్.
అయితే ఈ మధ్య కాలంలో అందరూ కుక్కలు, పిల్లులు పెంచుకుంటారు. వాటి కోసం ఎంతో ఖర్చు పెడుతుంటారు. కానీ నేను ఇలా పాపని పెంచుకొని, ఆ పాప బాధ్యత తీసుకొని గొప్పగా చదివించాలని అనుకుంటున్నానని బండ్ల తెలిపారు. ప్రస్తుతం ఆ పాప మా ఇంట్లో ఓ మెంబర్ అయిపోయింది అని అన్నాడు. అప్పుడప్పుడు ఈ పాపే మా అందరినీ బెదిస్తుందని సరదాగా నవ్వుతూ చెప్పుకొచ్చారు. ఈ తరుణంలో మరోసారి బండ్ల గణేష్ మంచితనాన్ని తెలుసుకున్న అభిమానులు అతని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. బండ్ల గణేష్ హీరోగా ‘డేగల బాబ్జీ’ అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే… త్వరలోనే ఈ చిత్రం విడుదల కానుంది.