Actor Arrested In Bangalore: తియ్యటి మాటలు విని తీర్థం పోతే నువ్వు గుల్లే నేను చల్లే అన్నట్లుగా ఉంది. దేశంలో ఎన్నో దారుణాలు జరుగుతున్నా ఆడవారిలో ఇంకా అమాయకత్వం పోవడం లేదు. ఎంత వారలైనా వేదాంతులైన గానీ ఆడదాని చూడగానే తేలిపోతురోయి అన్నారో సినీకవి. ఆడది ఒళ్లో పడే వరకు మగాడు ఎన్ని విషయాలైనా చెబుతాడు. పెళ్లంటే ముఖం చాటేస్తాడు. మనం ఎన్ని సంఘటనలు చూసినా? ఎన్ని దారుణాలు జరిగినా అదే కథ. అదే తంతు. కానీ మార్పు మాత్రం రావడం లేదు.చదువుకున్న వారు అంతే. చదువు రాని వారు అంతేలా ఉంది. లోకం గురించి తెలిసిన వారు మగాడి మాయలో పడకూడదు. పడితే ఇక మోసపోయినట్లే. ఏదైనా పెళ్లి తరువాతే అని తప్పించుకోవడం ఆడవారికి అలవాటు కావాల్సి ఉంది.

ఏదో మగాడు నాలుగు మంచి మాటలు చెప్పగానే పొంగిపోయి సర్వస్వం అర్పించి తీరా పెళ్లి చేసుకోమంటే నీ దిక్కున్న చోటు చెప్పుకోపో అని దూషించడం పరిపాటే. అందుకే వారికి లొంగకూడదు. వారిని దగ్గరకు రానీయకూడదు. ఆ ఒక్కటి అడక్కు అని తప్పించుకోవాలి. అంతేకాని అతడికి అన్ని అప్పగించి తరువాత ఏడిస్తే ఏం లాభం. జాగ్రత్తలు మనలోనే ఉండాలి. లోకం పోకడ తెలుసుకోవాలి. అప్పుడే జీవితంలో రాణిస్తాం. బతుకు పోరులో గెలుస్తాం.

Also Read: పుష్ప స్పూఫ్… యూట్యూబ్ రికార్డ్స్ బద్దలు కొడుతున్న సుడిగాలి సుధీర్
తాజాగా బెంగుళూరులో సినీనటుడు హర్షవర్ధన్ వర్ధమాన నటుడిగా, నిర్మాతగా ఎదుగుతున్నాడు. మిషన్ 2023 సినిమాను రూపొందించాడు.ఇందులో నటిగా అన్నపూర్ణేశ్వరిని పెట్టుకున్నాడు. దీంతో ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. అది కాస్త ప్రేమగా మారింది. ఇద్దరు చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. ఊసులు పంచుకున్నారు. ఆశల్లో మునిగి తేలారు. కబుర్లు చెప్పుకున్నారు. ఇక పెళ్లి చేసుకుందామని భావించారు. కానీ ఇంతలో సీన్ రివర్స్ అయింది. నేను నిన్ను పెళ్లి చేసుకోను అని నటుడు ప్లేటు ఫిరాయించాడు. \
దీంతో ఆమెకు పాలుపోలేదు. మోసపోయానని గ్రహించింది. చివరకు బెదిరింపులకు కూడా గురిచేసింది. అయినా నీ దిక్కున్న చోట చెప్పుకోపో అని చీదరించాడు.దీంతో పోలీసులను ఆశ్రయించింది. తనకు న్యాయం చేయాలని కోరింది. సదరు నటుడిపై కేసు పెట్టింది. ఇదివరకే ఓ కేసు నడుస్తుండగా మళ్లీ వీరి కేసు నమోదు కావడం కర్ణాటకలో సంచలనం అవుతోంది. చేసినతప్పుకు కటాకటాలు లెక్కించాల్సిందేనని పలువురు పేర్కొంటున్నారు. అందరికి ఆదర్శంగా ఉండాల్సిన వారే ఇలా మోసాలకు పాల్పడటం ఏమిటనే ప్రశ్నలు వస్తున్నాయి.
Also Read: టాలీవుడ్ : టుడే వైరల్ అవుతున్న క్రేజీ అప్ డేట్స్ !
[…] […]