Homeఎంటర్టైన్మెంట్Sukumar -Ajay Ghosh: పుష్ప సినిమా చేయనన్న నటుడు.. తిట్టేసిన సుకుమార్

Sukumar -Ajay Ghosh: పుష్ప సినిమా చేయనన్న నటుడు.. తిట్టేసిన సుకుమార్

Sukumar -Ajay Ghosh: సినిమాలు చేయడంలో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. రాజమౌళిది ఒక ప్రత్యేకత. సుకుమార్ ది మరో దారి. ఇంకా సురేందర్ రెడ్డి, హరీష్ శంకర్ వంటి వారిది మరో స్టైల్. ఒక్కో డైరెక్టర్ కు ఒక్కో పంథా ఉండటం తెలిసిందే. షూటింగ్ లో ఎంత బిజీగా ఉన్నా బయట మాత్రం నవ్వుకుంటూనే ఉంటారు. సెటైర్లు వేసుకుంటూ సరదాగా గడపడంతో పడిన కష్టం అంతా మరిచిపోవడం కామనే. ఈ నేపథ్యంలో పుష్ప సినిమా కోసం సుకుమార్ ఎంత కష్టపడ్డాడో అందరికి తెలిసిందే. ఆ సినిమా కూడా బ్లాక్ బస్టర్ గా నిలవడంతో పడిన కష్టం అంతా మరచిపోతారు. ఒక్కోసారి ఆర్టిస్టులను కంట్రోల్ చేయడం వీలు కాకపోతే సహనం కోల్పోయిన సందర్భంలో ఏదో మాట తూలనాడితే దానికి కూడా క్షమాపణలు చెప్పడం విశేషం.

Sukumar -Ajay Ghosh
Sukumar -Ajay Ghosh

పుష్ప సినిమాలో అజయ్ ఘోష్ కోసం ఓ వేషం సిద్ధం చేశారు. కానీ ఆయన కరోనా బారిన పడటంతో నేను రాలేను అని చెప్పి తప్పుకోవడంతో దర్శకుడు సుకుమార్ ఫోన్ చేసి అరగంట తిట్టారు. సినిమాలో ఈ పాత్ర నీ కోసమే ప్రత్యేకంగా తయారు చేసిన క్యారెక్టర్ కావడంతో నువ్వే చేయాలని సుకుమార్ పట్టుదలతో చేయించారు. దీంతో చిత్ర విజయానికి ఆయా పాత్రల ఎంపికలో సుకుమార్ ది విభిన్నమైన పద్ధతి కావడం తెలిసిందే. అందుకే ఆయన పాత్రకు ఎవరిని ఎంపిక చేస్తే వారితోనే తీయడం అలవాటు.

Also Read: Anasuya Bharadwaj: ఇండస్ట్రీలో గిల్లితే గిల్లించుకోవాలట.. బాంబు పేల్చిన అనసూయ

Sukumar -Ajay Ghosh
Ajay Ghosh

పుష్ప సినిమాలో ఓ సన్నివేశంలో 500 మంది ఆర్టిస్టులతో చేసే సందర్భంలో అందరిని రావాలని పిలుస్తూ ఒక దశలో సహనం కోల్పోయిన దర్శకుడు ఒరేయ్ నీయమ్మ రండ్రా అనే సరికి అందరు ఆశ్చర్యానికి గురయ్యారు. కానీ సీన్ అయిపోయాక అందరికి పేరుపేరున క్షమాపణలు చెప్పడం సుకుమార్ స్టైల్. దీంతో అందరు పరేషాన్ అయ్యారు. అంత చిన్న మాటకు ఇంత పెద్ద సారీ చెప్పడం ఏమిటని అందరు నివ్వెర పోయారు. అదే సుకుమార్ పద్ధతి. ఎవరిని నొప్పించకూడదనే ఉద్దేశంతోనే ఆయన సినిమాలు తీయడం తెలిసిందే.

Also Read:Instagram Top actors : విజయ్ దేవరకొండను అధిగమించిన అల్లు అర్జున్.. ఇన్‌స్టాగ్రామ్‌లో టాప్-8 దక్షిణాది నటులు

 

 

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
RELATED ARTICLES

Most Popular