Acharya: కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కలిసి నటించినటువంటి చిత్రం ఆచార్య. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ పనులను పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఫిబ్రవరి 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుందని ఇదివరకే చిత్రబృందం అధికారికంగా ప్రకటించారు. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, పోస్టర్లు, పాటలు విపరీతంగా ప్రేక్షకులను ఆకట్టుకొని సినిమాపై భారీ అంచనాలు పెంచాయి.

తాజాగా ఆచార్య సినిమా నుంచి రామ్ చరణ్ సిద్ధూ పాత్ర సంబంధించిన టీజర్ ను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ టీజర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.టీజర్ విడుదల చేసిన గంటల వ్యవధిలోనే మిలియన్ వ్యూస్ దక్కించుకొని సినిమాపై భారీ అంచనాలు పెంచుతున్నాయి. ముఖ్యంగా ఇందులో రామ్ చరణ్ చెప్పే డైలాగ్ ధర్మస్థలికి ఆపద వస్తే అది జయించడానికి ఆ అమ్మోరు తల్లి మాలో ఆవహించి ముందుకు పంపుద్ది అనే డైలాగ్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది.
Also Read: ఆచార్య మూవీ నుంచి చెర్రీ టీజర్ విడుదల… అరుపులు ఖాయం అంటున్న అభిమానులు
ఇక చివరికి నక్సలైట్లతో పోరాడి కొలను దగ్గర ఒకవైపు చిరుత తన పిల్ల నీళ్లు తాగుతుండగా కాపలా ఉంటుంది. అదే కొలనుకు మరో వైపు రామ్ చరణ్ నీళ్లు తాగుతుంటే చిరంజీవి చూస్తూ ఉండడంతో ఈ టీజర్ కు మరింత హైలెట్ గా మారింది. ఇక సినిమా మొత్తం ఏ విధంగా ఉండబోతుందో టీజర్ చూస్తేనే అర్థమయ్యే విధంగా డైరెక్టర్ తెరకెక్కించారు. ఇందులో రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే నటించగా మెగాస్టార్ చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ నటిస్తోంది. శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రామ్ చరణ్ నిరంజన్ రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Also Read: మరోసారి ఓకే స్క్రీన్‌పై చెర్రితో చిరు.. ఆ డైరెక్టర్ సినిమాలోనే?