Aata show grand finale winner: ఈమధ్య కాలం లో బుల్లితెర ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న డ్యాన్స్ రియాలిటీ షో ఏదైనా ఉందా అంటే , అది ప్రతీ శని ఆదివారాల్లో ప్రసారమయ్యే ‘ఆట’ షో అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు. నిహారిక కొణిదెల నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ షోకి సుడిగాలి సుధీర్ హోస్ట్ గా , కావ్యశ్రీ , విష్ణు ప్రియ, చలాకి చంటి /వంశీధర్ , సమీరా భరద్వాజ్ వంటి వారు టీం లీడర్స్ గా వ్యవహరిస్తున్నారు. అదే విధంగా ఈ షో కి నిర్మాతగా వ్యవహరిస్తున్న నిహారిక కొణిదెల తో పాటు సీనియర్ హీరోయిన్ రాధికా, రఘు మాస్టర్ వంటి వారు జడ్జీలుగా వ్యవహరిస్తున్నారు. నిన్న గాక మొన్న మొదలైన ఈ బిగ్గెస్ట్ డ్యాన్స్ రియాలిటీ షో, ఇప్పుడు గ్రాండ్ ఫినాలే ని కూడా పూర్తి చేసుకుంది. త్వరలోనే ఈ ఫినాలే ఎపిసోడ్ టీవీ లో టెలికాస్ట్ కాబోతుంది.
ఇదంతా పక్కన పెడితే నిన్నటి ఎపిసోడ్ లో గౌరవ్ , పుష్ప , ప్రీతీ మరియు హానీ అద్భుతమైన డ్యాన్స్ పెర్ఫార్మన్స్ అందించారు. వీరిలో సమీరా భరద్వాజ్ టీం కి చెందిన పుష్ప, అదే విధంగా కావ్యశ్రీ టీం నుండి గౌరవ్ వంటి కంటెస్టెంట్స్ టికెట్ టు ఫినాలే గెలుచుకొని నేరుగా గ్రాండ్ ఫినాలే లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ నలుగురిలో ఏ ఒక్కరు కూడా తక్కువ కాదు. వీళ్ళు డ్యాన్స్ వేస్తున్నంత సేపు నోరు తెరుచుకొని అలా చూస్తూ ఉండిపోతాము అంతే. అసలు వీళ్ళ శరీరం లో ఎముకలు ఉన్నాయా లేవా అనేది కూడా అర్థం కాదు , అంతటి గొప్ప డ్యాన్సర్లు వీళ్లంతా. వీరిలో ఎవరు గెలిచినా కూడా ఫీల్ ఆడియన్స్ ఫీల్ అవ్వరు. కేవలం ఈ నలుగురు మాత్రమే కాదు , ఇతర కంటెస్టెంట్స్ కూడా అద్భుతమైన డ్యాన్సర్స్ కేవలం చిన్న మార్జిన్ తోనే వీళ్లంతా వెనకబడి ఉన్నారు.
అయితే గ్రాండ్ ఫినాలే షూటింగ్ కూడా అయిపోవడం తో , అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం , సమీరా భరద్వాజ్ టీం కి చెందిన పుష్ప టైటిల్ విన్నర్ గా నిల్చినట్టు తెలుస్తోంది. మరో రెండు వారాల్లో ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నారు. మరి రన్నర్ గా ఎవరు నిలిచారు అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ . గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ లో ప్రతీ కంటెస్టెంట్ ప్రాణం పెట్టి డ్యాన్స్ చేశారట. ఇలాంటి పోటీ ఈమధ్య కాలం లో ఏ డ్యాన్స్ షో లోనూ చూసి ఉండమని , అంతటి అద్భుతంగా ఈ ఎపిసోడ్ వచ్చిందని అంటున్నారు. మరి ఇందులో ఎంతమాత్రం నిజముందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.