Aata Sandeep Comments On Chiranjeevi: కొంతమందికి ఎంతో గొప్ప టాలెంట్ ఉంటుంది, కానీ ఆ టాలెంట్ ప్రపంచం మొత్తం గుర్తించడానికి చాలా సమయం పడుతుంది. ఆ సమయం వచ్చే వరకు పట్టువదలకుండా కష్టపడినా వారికే విజయం దక్కుతుంది. అలా ఎప్పుడో 2006 వ సంవత్సరం లో ‘ఆట’ అనే డ్యాన్స్ షో తో కెరీర్ ని మొదలు పెట్టిన సందీప్, సినీ ఇండస్ట్రీ లోకి వచ్చి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ని సంపాదించుకోవడానికి 2025 వరకు ఆగాల్సి వచ్చింది. అంటే అక్షరాలా 20 ఏళ్ళు అన్నమాట. ఈ గ్యాప్ లో ఆయన ఎన్నో డ్యాన్స్ రియాలిటీ షోస్ చేసాడు. ‘బిగ్ బాస్ 7’ లో ఒక కంటెస్టెంట్ గా కూడా పాల్గొన్నాడు. ఇన్ని చేసింది సినిమాల్లో అవకాశాలు సంపాదించడం కోసమే. కానీ సందీప్ టాలెంట్ ని ఎవ్వరూ గుర్తించలేకపోయారు. ఆయన టాలెంట్ ని గుర్తించిన మొట్టమొదటి వ్యక్తి సందీప్ రెడ్డి వంగ.
‘యానిమల్’ చిత్రం లో ఒక పాటకు కొరియోగ్రఫీ చేసే అవకాశం ఇచ్చాడు. ఇతనిలో టాలెంట్ ని గమనించిన మెగాస్టార్, కొత్త వాడికి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రానికి పిలిచి మరీ అవకాశం ఇచ్చాడు. నిన్న విడుదల చేసిన ‘Hook Step’ పాటకు కొరియోగ్రఫీ చేసింది ఈయనే. ఈ పాట ని స్టేజి మీద పెర్ఫర్మ్ చేసినప్పుడు ఆడిటోరియం మొత్తం దద్దరిల్లిపోయింది. అభిమానులు నాన్ స్టాప్ గా చిందులు వేస్తూనే ఉన్నారు. అది చూసి విక్టరీ వెంకటేష్ లో, అనిల్ రావిపూడి లో కూడా ఉత్సాహం వచ్చి పైకి లేచి డ్యాన్స్ వేయడం హైలైట్ గా నిల్చింది .అయితే ఈ ఈవెంట్ లో సందీప్ బాగా ఎమోషనల్ అయిపోయాడు. మోకాళ్ళ మీద కూర్చొని మెగాస్టార్ చిరంజీవి వైపు చూసి మాట్లాడుతూ, ధన్యవాదాలు చెప్పుకున్నాడు. ఇది చూసినప్పుడు అయ్యో పాపం అని అనిపించింది.
సందీప్ మాట్లాడుతూ ‘నాకు ఇలాంటి బ్లాక్ బస్టర్ సాంగ్ కి కొరియోగ్రఫీ చేసే అవకాశం ఇచ్చినందుకు చిరంజీవి గారికి జీవితాంతం రుణపడి ఉంటాను. అనిల్ అన్నయ్య నాకు ఎంతో సపోర్టుగా నిలిచాడు. మీలాగే నేను కూడా కొన్నాళ్ల క్రితం మీ మధ్యన కూర్చొని చిరంజీవి గారు మాట్లాడుతుంటే ఈలలు చప్పట్లు కొడుతూ ఉండేవాడిని . ఈరోజు ఆయనకు కొరియోగ్రఫీ చేసే స్థాయికి వచ్చాను. నా జీవిత కల నెరవేరింది. చాలా ధన్యవాదాలు సార్, ఇన్ని రోజులు నన్ను ఎవ్వరూ గుర్తించలేదు సార్, నన్ను గుర్తించిన ఏకైక వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి మాత్రమే’ అంటూ బాగా ఎమోషనల్ అయిపోయాడు. ఆయన మాట్లాడిన మాటలను మీరు కూడా వినండి.