Aaryan Teaser Review: తమిళనాడు యంగ్ హీరోలలో మంచి క్రేజ్ ఉన్నవారిలో ఒకరు విష్ణు విశాల్(Vishnu Vishal). ఈయన నటించిన ఒక సినిమాని తెలుగు లో మన రవితేజ క్రాక్ పేరుతో రీమేక్ చేసి పెద్ద కమర్షియల్ సక్సెస్ ని అందుకున్నాడు. ఆ తర్వాత ఈయన హీరో గా నటించిన ‘మట్టి కుస్తీ’ చిత్రాన్ని తెలుగు లో రవితేజ స్వయంగా తన నిర్మాణ సంస్థ ద్వారా విడుదల చేసాడు. కమర్షియల్ గా ఈ చిత్రం యావరేజ్ రేంజ్ లో ఆడింది. కానీ ఈ చిత్రం తర్వాత విడుదలైన ‘లాల్ సలామ్’ మాత్రం ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. ఇందులో సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రత్యేక పాత్రలో కనిపించాడు. అయినప్పటికీ కూడా కమర్షియల్ గా ఫ్లాప్ అయ్యింది. ఇప్పుడు ఆయన ‘ఆర్యన్’ అనే చిత్రం తో మన ముందుకు రాబోతున్నాడు. కాసేపటి క్రితమే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ని విడుదల చేశారు మేకర్స్.
ఈ టీజర్ కి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇది ఒక ఇన్వెస్టిగేషన్ జానర్ లో తెరకెక్కిన సినిమా గా అనిపిస్తుంది. విలన్ ఇందులో ఒక సైకో. తనకు చిరాకు కలిగినప్పుడల్లా మర్డర్లు చేస్తుంటాడు. చాలా తెలివిగా తప్పించుకుంటూ ఉంటాడు కూడా, ప్రతీ ఒక్కటి అతను ప్లాన్ చేసిన విధంగానే నడుచుకుంటూ ఉంటుంది. చివరికి హీరో చేసే పనులు కూడా అతని ప్లాన్ ప్రకారమే నడుస్తుంటాయి. అంతటి తెలివైన క్రిమినల్ అన్నమాట. అలాంటి క్రిమినల్ ఆటలను పోలీస్ క్యారక్టర్ చేస్తున్న విష్ణు విశాల్ ఎలా అరికట్టాడు. జరిగే దారుణాలను ఎలా ఆపగలిగాడు అనేదే స్టోరీ. టీజర్ తోనే సినిమా ఎలా ఉండబోతుంది అనే ఐడియా ఇచ్చాడు డైరెక్టర్. ఈ చిత్రం ద్వారా ప్రవీణ్ అనే కొత్త డైరెక్టర్ ఇండస్ట్రీ కి పరిచయం కాబోతున్నాడు. గిబ్రాన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా, హీరో గా చేస్తున్న విష్ణు విశాలే నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు.
శ్రద్ద శ్రీనాధ్, మానస చౌదరి ఈ చిత్రం లో హీరోయిన్స్ గా నటించారు. ప్రామిసింగ్ క్యాస్టింగ్, టెక్నీషియన్స్ తో చాలా రిచ్ గానే ఈ చిత్రాన్ని తెరకెక్కించారని అర్థం అవుతుంది కానీ, ఇలాంటి సినిమాల్లో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అత్యంత కీలకం. అవి ఉన్నాయా లేదా అనేదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఎందుకంటే ఈ జానర్ లో ఇప్పటికే ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. ఒకవేళ సినిమా బాగా తీసినప్పటికీ కూడా, ఆడియన్స్ పూర్తి స్థాయిలో సంతృప్తి చెందాలంటే నిజమైన థ్రిల్లింగ్ అనుభూతి కలగాలి. ఆ అనుభూతి మాత్రం ఈ చిత్రం కలిగించేలా లేదని టీజర్ ని చూస్తే తెలుస్తుంది. ఇలాంటి సైకో థ్రిల్లర్ జానర్స్ గతం లో చాలానే చూసాము అనే ఫీలింగ్ కలిగింది. మరి సినిమా కూడా ఇలాగే ఉంటుందా లేదా కొత్తగా ఉంటుందా అనేది చూడాలి.