Aanjjan Srivastav: అమితాబచ్చన్ బాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో బిగ్ బి అని ముద్దుగా పిలుచుకుని ఈ లెజెండరీ యాక్టర్ గురించి ప్రత్యేకంగా ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. తన కెరీర్ లో ఎన్నో కష్టనష్టాలను చూసిన ఈయన ఒకానొక టైం లో దివాలా తీసే పరిస్థితి కూడా ఎదుర్కొన్నారు. ఇక అమితాబ్ అని అయిపోయింది అని అందరూ భావించే టైంలో…ఊహించని విధంగా కోలుకోవడమే కాకుండా ఉన్నతమైన శిఖరంలా నిలబడ్డాడు.
అమితాబ్ కి అత్యంత సన్నిహితుడైన అంజన్ శ్రీవాస్తవ్ 90వ దశకం సమయంలో తనకు అమితాబ్ కి మధ్య ఉన్నటువంటి రిలేషన్షిప్ గురించి మాట్లాడిన వీడియో ఇప్పుడు వైరల్ అయింది. అమితాబ్ స్థాపించిన ఏబీసీఎల్ నష్టాల ఊబిలో కూరుకుపోయిన సమయంలో కూడా అంజన్ శ్రీవాస్తవ్ అమితాకు అండగా నిలబడ్డాడు. ఎంతో కాలం కొనసాగిన వారి మైత్రి ఏ విధంగా కనుమరుగైపోయింది అన్న విషయం అంజన్ ఈ వీడియోలో పంచుకున్నారు.
నటుడు అవ్వాలన్న కోరికతో ఎంతో తపించిన అంజన్ శ్రీవాస్తవ్ తన తండ్రి కోరిక మేరకు మొదట అలహాబాద్ బ్యాంకులో ఉద్యోగిగా చేరారు. బ్యాంకు జాబ్ చేస్తూనే… ఆసక్తి కలిగిన నటనను వదులుకోలేక.. చిన్న చిన్న పాత్రల్లో నటిస్తూ వచ్చారు. అంజన్ శ్రీవాస్తవ్ యాక్టర్ గా ఎంత బిజీ అయినప్పటికీ తన ఉద్యోగాన్ని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు. 2001న అతను బ్యాంక్ నుంచి తన రిటైర్మెంట్ ను తీసుకున్నారు.
మరోపక్క సినీ ఇండస్ట్రీలో బాగా సంపాదించిన అమితాబ్ వ్యాపారంలో కూడా విస్తరించాలి అన్న ఉద్దేశంతో ఏబీసీఎల్ అనే కంపెనీని 1987 లో స్థాపించారు.ఫిల్మ్ ప్రొడక్షన్ మరియు ఈవెంట్ మేనేజ్‌మెంట్ బాధ్యతలు నిర్వహించే ఈ కంపెనీ క్రమంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవడం మొదలైంది. 1993 ప్రాంతంలో ఈ కంపెనీ నేతృత్వంలో జయాబచ్చన్ ప్రొడక్షన్ తో దేక్ భాయ్ దేక్ అనే టీవీ షో ని కూడా నిర్మించారు. 1999 ప్రాంతంలో కంపెనీ బకాయిలు చెల్లించలేక పూర్తిగా దివాలా తీసే పరిస్థితికి చేరుకుంది.
కంపెనీ ప్రారంభించే సమయంలో అమితాబచ్చన్ తో ఉన్నటువంటి బలమైన వృత్తి మరియు వ్యక్తిగత బంధం కారణంగా ఆంజన్ శ్రీవాస్తవ్ ,తాను పనిచేసే బ్యాంకులో అమితాబచ్చన్ ను పరిచయం చేశాడు. అంతేకాకుండా తన బ్యాంకు లోనే అమితాబచ్చన్ వ్యాపారానికి సంబంధించిన అకౌంట్ కూడా ఓపెన్ చేయించాడు. ఆ తర్వాత డిగ్రీ కష్టాల్లో ఉన్నప్పుడు అంజన్ అతనికి అండగా నిలబడ్డాడు.
“అమితాబ్ ఎవరికి చెప్పలేనటువంటి భయంకరమైన పరిస్థితిలో చిక్కుకున్నాడు. అప్పట్లో అతనికి వ్యతిరేకంగా ఒక పెద్ద విప్లవమే జరిగింది. అమితాబ్ కి వ్యతిరేకంగా నిరసనలతో పాటు అతని పోస్టర్లను కూడా చింపేసే పరిస్థితి .ఆ సమయంలో జరుగుతున్నటువంటి పరిణామాలను చూసి అమితాబ్ కూడా ఎంతో తల్లడిల్లారు.ఆ సమయంలో అతను ఎలా ఉన్నాడు అని తెలుసుకోవడానికి నేను తుఫాన్ మూవీ సెట్స్ కూడా వెళ్లాను. అంత బాధలో కూడా ఆయన నేను బాగున్నాను అని చెప్పాడు.” అని అంజన్ అన్నారు.
ఏబీసీఎల్ ఖాతా మా బ్యాంకులో ఉన్నందున.. స్టేట్మెంట్ తీసుకురావడానికి బ్యాంకు నుంచి అతని కార్యాలయానికి వెళ్ళవలసి వచ్చింది. అయితే అక్కడ అమితాబ్ కు అందరూ వ్యతిరేకంగా ఉన్నారు అన్న విషయం నేను , మా బ్యాంక్ మేనేజర్ గమనించాం. అమితాబ్ నిర్దోషి అని ఇటువంటి విషయంలో అతన్ని లాగడం సబబు కాదు అని నిర్వాహకులకు నేను నచ్చజెప్పాను. బ్యాంకు నుంచి ఆఫీస్ కి వచ్చిన మమ్మల్ని చూసి అమితాబ్ చేతులు జోడించి లేచి నిలబడి వీలైనంత త్వరగా డబ్బు తిరిగి ఇస్తాను అని అన్నారు.
“అతని అలాంటి పరిస్థితుల్లో చూసి నాకు చాలా బాధ కలిగింది. ఇకముందు ఇటువంటివి జరగకూడదు అని సలహా ఇచ్చి అక్కడ నుంచి తిరిగి వచ్చాను. 57 ఏళ్ల వయసులో అంతా అయిపోయింది అని అందరూ అనుకునే సమయంలో కౌన్ బనేగా కరోడ్‌పతి రూపంలో అమితాబ్ కు సెకండ్ కం బ్యాక్ లభించింది. అతను కోలుకోవడమే కాకుండా బకాయిలు మొత్తం పూర్తిగా చెల్లించారు.కౌన్ బనేగా కరోడ్‌పతి కారణంగా అమితాబ్ కోలుకోవడం నాకు ఆనందం కలిగించినా ..అతను నాకు దూరం కావడం తీరని బాధను మిగిల్చింది. అప్పటివరకు ప్రతి హోలీ కుటుంబంతో సహా కలిపి జరుపుకునే మేము క్రమంగా ఒకరికొకరం దూరం అవుతూ వచ్చాము. నా గురించి వ్యతిరేకంగా ఇండస్ట్రీలో మనుషులే అమితాబ్ కు తప్పుగా చెప్పారు అని నాకు తెలుసు. ఏదేమైనాప్పటికీ సంవత్సరాలు తరబడి కష్టసుఖాలలో తోడు ఉన్న మా మైత్రి ఒక్క షో తో పూర్తిగా పోయింది. “అని అంజన్ అన్నారు.