https://oktelugu.com/

Bollywood Hope Liger Movie: అమీర్, అక్షయ్ ముంచేశారు… బాలీవుడ్ ఆశలన్నీ విజయ్ ‘లైగర్’ పైనే!

Bollywood Hope Liger Movie: బాలీవుడ్ టైం అసలేం బాగాలేదు. వరుస డిజాస్టర్స్ తో పరిశ్రమ కుదేలవుతోంది. ఈ మధ్య కాలంలో విడుదలైన చిత్రాలన్నీ దారుణ పరాజయం ఎదుర్కొన్నాయి. రణ్వీర్ కపూర్ సంశేరా, అమీర్ ఖాన్ లాల్ సింగ్ చడ్డాతో పాటు భారీ బడ్జెట్ చిత్రాలు సైతం బొక్కబోర్లా పడ్డాయి. ఆర్యన్ కార్తీక్ భూల్ బులియా 2 మినహాస్తే ఈ మధ్య కాలంలో విజయం సాధించిన ఒక్క హిందీ చిత్రం లేదు. ఈ క్రమంలో విజయ్ దేవరకొండ […]

Written By:
  • Shiva
  • , Updated On : August 24, 2022 / 10:51 AM IST
    Follow us on

    Bollywood Hope Liger Movie: బాలీవుడ్ టైం అసలేం బాగాలేదు. వరుస డిజాస్టర్స్ తో పరిశ్రమ కుదేలవుతోంది. ఈ మధ్య కాలంలో విడుదలైన చిత్రాలన్నీ దారుణ పరాజయం ఎదుర్కొన్నాయి. రణ్వీర్ కపూర్ సంశేరా, అమీర్ ఖాన్ లాల్ సింగ్ చడ్డాతో పాటు భారీ బడ్జెట్ చిత్రాలు సైతం బొక్కబోర్లా పడ్డాయి. ఆర్యన్ కార్తీక్ భూల్ బులియా 2 మినహాస్తే ఈ మధ్య కాలంలో విజయం సాధించిన ఒక్క హిందీ చిత్రం లేదు. ఈ క్రమంలో విజయ్ దేవరకొండ లైగర్ మూవీపైనే బయ్యర్లు ఆశలు పెట్టుకున్నారు.

    Vijay Deverakonda

    లైగర్ మూవీపై విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి. ఈ మూవీ బాక్సాఫీస్ షేక్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఒక్క హిందీ వర్షన్ ఫస్ట్ డే రూ. 10 నుండి 15 కోట్లు రాబట్టవచ్చని అంచనా వేస్తున్నారు. ఇక తెలుగుతో పాటు మిగతా వర్షన్స్ కలుపుకొని మొదటి రోజు లైగర్ రూ. 30 కోట్లకు పైనే ఓపెనింగ్స్ సాధిస్తుందని అంచనా. వీకెండ్ ముగిసే నాటికి రూ. 100 కోట్లకు పైగా వసూళ్లు ఈ మూవీ సాధిస్తుంది అంటున్నారు. లైగర్ మూవీ ప్రమోషన్స్ టీం భారీగా నిర్వహించారు. దేశంలోని అన్ని ప్రధాన నగరాలను హీరో విజయ్, అనన్య పాండే సందర్శించారు. ఎక్కడకు వెళ్లినా భారీ రెస్పాన్స్ దక్కింది.

    Also Read: Surekha Vani: బాగా డబ్బులున్న బాయ్ ఫ్రెండ్ కావాలి… మనసులో కోరిక పచ్చిగా బయటపెట్టిన సురేఖా వాణి

    Vijay Deverakonda

    విజయ్ దేవరకొండను చూడడానికి జనాలు ఎగబడ్డారు. అదే స్థాయి ఆదరణ సినిమాకు కూడా దక్కుతుంది. లైగర్ భారీ వసూళ్లు సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు. వరుస డిజాస్టర్స్ నేపథ్యంలో బయ్యర్లను లైగర్ మూవీ కాపాడుతుందని ఆశలు పెట్టుకున్నారు. మరి వాళ్ళ అంచనాలు ఎంత వరకు నిజమవుతాయా చూడాలి. పూరి కనెక్ట్స్ , ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించగా.. రమ్యకృష్ణ కీలక రోల్ చేశారు. మాజీ వరల్డ్ హెవీ ఛాంపియన్ మైక్ టైసన్ ఈ మూవీలో నటించడం విశేషం.

    Also Read:Adani Bought NDTV: ఎన్డీటీవీ షేర్లు గౌతం అదానీ కొనడం వెనుక అసలు రహస్యమేంటి?

     

     

    Tags