Chiranjeevi Acharya: తెలుగు సినిమా పరిశ్రమలో చిరంజీవి స్థానం ఏంటో అందరికి తెలిసిందే. మెగాస్టార్ గా ఆయన అందరికి సుపరిచితుడే. ఆయన చిత్రాలు కూడా అదే రేంజ్ లో ఉంటాయి. బాక్సాఫీసు కలెక్షన్లు కొల్లగొట్టడంలో ఆయనకు ఆయనే సాటి. ఆయనకు లేరవెరు పోటీ. అంతటి సామ్రాజ్యాన్ని విస్తరించుకున్న చిరు అప్పుడప్పుడు చేసే పొరపాట్లతో పెద్ద నష్టమే భరిస్తున్నారు. అదే కోవలో ఆచార్య కూడా నిరాశపరిచి చిరంజీవి ఆశలను గల్లంతు చేసింది. ఎన్నో ఆశలతో తెరకెక్కిన సినిమా కావడంతో ప్రేక్షకులు కూడా హిట్లని నమ్మారు. కానీ తీరా విడుదలయ్యాక తెలిసింది ఫట్టని. దీంతో ఆయన నైరాశ్యంలో మునిగిపోయారు. ఎన్నో ఊహలతో తీసిన సినిమా బోల్తా కొట్టడంతో ఎటూ తేల్చుకోలేకపోయారు. ఒక దశలో నిర్మాతకు చేయూతనందించేందుకు కూడా తన పారితోషికం త్యాగం చేశారనే టాక్ కూడా వచ్చింది.

తెలుగులో రెండో ఆ తో మొదలయ్యే చిరు సినిమాలన్ని ఫట్ అయినట్లు రుజువులు ఉన్నాయి. కెరీర్ మొదట్లో తీసిన ఆరని మంటలు ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్లుగా ఆడలేకపోయింది. అప్పుడే నిలదొక్కుకుంటున్న చిరంజీవికి ఆ సినిమా చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఇక తరువాత వచ్చిన ఆడవాళ్లు మీకు జోహార్లు కూడా నిలవలేకపోయింది. దీంతో చిరంజీవికి మరో అపజయం వెంటాడింది. ఇలా రెండో ఆ తో మొదలయ్యే సినిమాల పరంపరలో చిరుకు అపఖ్యాతి తెచ్చిపెట్టాయి.
Also Read: Rajamouli Mahesh Babu: మహేష్ బాబు విషయంలో రాజమౌళి తప్పు చేస్తున్నాడా?
తరువాత కాలంలో వచ్చిన ఆరాధన కూడా ఆదుకోలేకపోయింది. భారతీరాజా దర్శకత్వంలో ఎన్నో అంచనాలతో వచ్చిన సినిమా అయినా బాక్సాఫీసు దగ్గర బోల్తా పడింది. కానీ చిరుకు మాత్రం పేరు తెచ్చి పెట్టింది. కె.విశ్వనాథ్ దర్శకత్వంలో తీసిన ఆపద్భాంధవుడు సైతం కలెక్షన్ల పరంగా నిరాశపరచినా అవార్డులు మాత్రం దక్కాయి. ఇలా చిరంజీవి కెరీర్ లో ఆ అనే అక్షరంతో మొదలైన సినిమాలన్ని బోల్తా కొట్టాయి. కానీ హిందీలో తీసిన ఆజ్ కా గుండా రాజ్ మాత్రం సూపర్ హిట్ అయింది. అయితే ఇది తెలుగు సినిమా కాదనే వాదన కూడా వచ్చింది.

ఇక మొదటి అ తో మొదలయ్యే అడవిదొంగ, అల్లుడా మజాకా, అన్నయ్య చిత్రాలు మాత్రం చిరంజీవికి హిట్లు తెచ్చిపెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చిరంజీవి సినిమాలు ఆ తో మొదలైతే అంతే సంగతి అని తెలుస్తోంది. ఆచార్య ఫెయిల్ కావడంతో ఈ అంచనాలు అన్ని తెరపైకి వస్తున్నాయి. కానీ మోచేతిలో బలముంటే మొండి కొడవలి అయినా తెగుతుందనేది సామెత. కథలో బలముంటే కచ్చితంగా హిట్ అవుతుంది. లేదంటే ఫట్టవుతుందని తెలియదా. ఏదో ఉపశమనం కోసం ఇవన్ని చెబుతుంటారు. ఎందుకు బోల్తా పడిందనే విషయం మీదే ఇవన్ని చర్చకు రావడం గమనార్హం.