Faima- Praveen: అంచనాలకు మించి బిగ్ బాస్ హౌస్లో రాణించింది ఫైమా. బాల ఆదిత్య, గీతూ, చంటి వంటి హేమాహేమీలు ఎలిమినేటైనా ఆమె స్ట్రాంగ్ గా నిలబడింది. గట్టిగా మాట్లాడే తత్త్వం, టాస్క్స్ లో పోరాట పటిమ ప్రేక్షకుల మనసు దోచుకునేలా చేశాయి. సత్తువ లేకపోయినా ఫిజికల్ టాస్క్స్ లో మగాళ్లకు పోటీ ఇచ్చేది. అలాగే మంచి ఎంటర్టైనర్ గా పేరు తెచ్చుకుంది. హోస్ట్ నాగార్జున ఫైమా ఆటతీరుకు ఇంప్రెస్ అయ్యాడు. ముఖ్యంగా రేవంత్ ని గట్టిగా ప్రశ్నించిన ఒకే ఒక కంటెస్టెంట్ ఫైమా.

రేవంత్ హౌస్లో ఎంత వరస్ట్ గా బిహేవ్ చేస్తాడో… తోటి కంటెస్టెంట్స్ ని ఎలా చులకనగా చూస్తాడో ఫైమా గొంతెత్తి చెప్పింది. రేవంత్ చేసే తప్పులు ఎవరికీ కనిపించడం లేదా అని గమ్మున ఉంటున్న తోటి కంటెస్టెంట్స్ ని నిలదీసింది. ఫైమా రేవంత్ విషయంలో అసలు తగ్గేది కాదు, ఇంట్లో అందరూ సమానమే అంటూ విరుచుకుపడేది. అయితే వెటకారం,సాఫ్ట్ గా ఉండే కంటెస్టెంట్ మెరీనాను ఓ సందర్భంలో హర్ట్ చేసేలా మాట్లాడటం ఆమెకు మైనస్ గా మారాయి.
కేవలం ఫైనల్ కి రెండు వారాల ముందు 13వ వారం ఫైమా ఎలిమినేట్ అయ్యింది. హౌస్లో ఆదిరెడ్డితో ఫైమా స్నేహం చేసింది. ఫైమా ఎలిమినేషన్ డే నాడు ఆదిరెడ్డి బాగా ఏడ్చాడు. కాగా బయట ఫైమాకు గ్రాండ్ వెల్కమ్ దక్కింది. అభిమానులు టపాసులతో ఆమెకు వెల్కమ్ చెప్పారు. అయితే ప్రియుడు ప్రవీణ్ ఆమెను ప్రత్యేకంగా ఇంటికి అహ్వానించాడు. కేక్ తీసుకొని ఫైమా ఇంటికి వెళ్లి, సెలబ్రేట్ చేశాడు. అలాగే కడప దర్గా నుండి తెచ్చిన పవిత్ర జలాన్ని ఫైమాకు ఇచ్చాడు.

ఫైమా ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకున్నాడు. ఫైమా ప్రవీణ్ నుండి గిఫ్ట్ కోరుకుంది. ప్రవీణ్ మెడలో ఉన్న గోల్డ్ చైన్ కావాలని అడిగింది. దానిలో ఏముంది తీసుకో అని’ ప్రవీణ్ మెడలో నుండి గోల్డ్ చైన్ తీసి ఫైమా మెడలో స్వయంగా వేశాడు. వీడియో కోసం బిల్డప్ ఇవ్వడం కాదు, ఇక ఈ చైన్ నాకే అని ఫైమా ప్రవీణ్ కి చెప్పింది. ఈ సెలెబ్రేషన్స్ లో ఫైమా తల్లి కూడా జాయిన్ అయ్యారు. కాగా హౌస్లోకి వెళ్లే ముందే ప్రవీణ్ తన ప్రియుడిగా ఫైమా చెప్పింది. కష్టకాలంలో సప్పోర్ట్ గా నిలిచిన ప్రవీణ్ ఎప్పటికీ మనసులో ఉండిపోతాడని ఎమోషనల్ అయ్యింది.