Sankranthi Race 2026: ఈ సంక్రాంతి అన్ని సంక్రాంతి పండుగలు లాగా కాదు, ఈసారి బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ ఎవ్వరూ ఊహించని విధంగా ఉండబోతుంది. కానీ రెండు ప్రధాన సినిమాల మధ్యనే భారీ పోటీ, థియేటర్స్ కూడా ఈ రెండు సినిమాలకే అత్యధిక శాతం పోతాయి. వందల కోట్ల వ్యాపారం కూడా రెండు సినిమాలు మీదనే జరిగాయి. ఆ రెండు సినిమాల్లో ఒకటి ప్రభాస్(Rebel Star Prabhas) నటించిన ‘రాజా సాబ్'(The Rajasaab Movie), రెండవది మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad gaaru). ఈ రెండు చిత్రాల కోసం అభిమానులు, ప్రేక్షకులు భారీ అంచనాలతో ఎదురు చూస్తున్నారు. ఆ అంచనాలను ఈ సినిమాలు అందుకుంటాయో లేదో తెలియదు కానీ, ఒకవేళ అందుకుంటే మాత్రం సంక్రాంతికి వచ్చే రెవిన్యూ, వచ్చే ఏడాది మొత్తం కలిపినా రాదు అని చెప్పొచ్చు. ఈ రెండు సినిమాలతో పాటు విడుదల అవ్వబోయే మిగిలిన నాలుగు సినిమాలు గురించి కూడా మాట్లాడుకుందాం.
మాస్ మహారాజా రవితేజ నటించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే చిత్రం జనవరి 13 న విడుదల కాబోతుంది. ఈ సినిమాపై పెద్దగా అంచనాలు లేవు, బీభత్సమైన పాజిటివ్ టాక్ వస్తే తప్ప, ఆ చిత్రం గట్టెక్కే పరిస్థితి కనిపించడం లేదు. ఇక ఈ చిత్రం తర్వాత జనవరి 14న నవీన్ పోలిశెట్టి హీరో గా నటించిన ‘అణగనగా ఒక రాజు’ అనే చిత్రం విడుదల కాబోతుంది. ఇప్పటి వరకు ఈ చిత్రం నుండి వచ్చిన కంటెంట్ ఎందుకో ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో అలరించలేదు. కానీ నవీన్ పోలిశెట్టి కి ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్ ఏర్పడింది కాబట్టి, ఈ చిత్రాన్ని ఆడియన్స్ మూడవ ఛాయస్ గా ఎంచుకోవచ్చు. ఇక లేటెస్ట్ గా సంక్రాంతి రేస్ లోకి జాయిన్ అయిన చిత్రం శర్వానంద్ హీరో గా నటించిన ‘నారీ నారీ నడుమ మురారి’.
చాలా కాలం తర్వాత పూర్తి స్థాయి ఎంటర్టైన్మెంట్ ఉన్న సినిమాని శర్వానంద్ చేస్తున్నాడు. ఈ చిత్రానికి ‘సామజవరగమనా’ ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకుడు. ఈరోజు విడుదలైన గ్లింప్స్ వీడియో ని చూస్తే కచ్చితంగా బాగా వర్కౌట్ అయ్యే కామెడీ ని వీళ్ళు ఈ సినిమాలో చూపించబోతున్నారని తెలుస్తోంది. ఒకవేళ అదే జరిగితే ఈ చిత్రం ఎవ్వరూ ఊహించని రీతిలో బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతాలు క్రియేట్ చేయొచ్చు. ఏ రేంజ్ లో అంటే ‘రాజా సాబ్’, ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రాల్లో ఎదో ఒక సినిమాని డామినేట్ చేయొచ్చు. అంతటి ప్రమాదం ఉంది. ఇక సంక్రాంతి బరిలో దిగిన ఆరవ చిత్రం తమిళ హీరో విజయ్ నటించిన ‘జన నాయగన్’. ఈ సినిమాపై తమిళ ఆడియన్స్ లోనే పెద్దగా అంచనాలు లేవు, ఇక తెలుగు లో ఎంత మేరకు ఈ పోటీలో నిలబడుతుందో చూడాలి.