
Star hero Affair హీరో శింబుకు ఎక్కడో సుడి ఉంది. ఒక అమ్మాయితో బ్రేకప్ కాగానే మరొక అమ్మాయి సిద్ధంగా ఉంటుంది. అధికారికంగా ముగ్గురు హీరోయిన్స్ తో ఎఫైర్ నడిపిన శింబు ఒక మెడిసిన్ స్టూడెంట్ తో పెళ్ళికి సిద్దమయ్యాడన్న వార్త సంచలనం రేపుతోంది. త్వరలో ఆమెను వివాహం చేసుకోబోతున్నాడట. శ్రీలంకకు చెందిన బడా వ్యాపారవేత్త కూతురైన ఆ అమ్మాయి శింబుకి వీరాభిమాని అట. ఒకసారి శింబును కలిసిందట. అప్పుడు వీరి మధ్య ఫోన్ నెంబర్స్ ఎక్స్ఛేంజ్ అయ్యాయట. అలా పెరుగుతూ పోయిన పరిచయం ప్రేమకు దారితీసిందట. ఇద్దరు పెళ్ళికి సిద్దమయ్యారట. ఇరు కుటుంబాల పెద్దలు కూడా అంగీకారం తెలిపిన నేపథ్యంలో త్వరలో పెళ్లంటున్నారు.
దీనిపై అధికారిక సమాచారం లేకున్నప్పటికీ ప్రముఖంగా వినిపిస్తోంది. కోలీవుడ్ మీడియాలో ఈ వార్త దుమారం రేపుతోంది. శింబు గతంలో నయనతార, హన్సిక, త్రిషలతో ప్రేమాయణం నడిపారు. ఏళ్ల తరబడి సీరియస్ గా ఒక్కొక్కరితో ప్రేమకథలు సాగించారు. నయనతార పరిశ్రమకు వచ్చిన కొత్తల్లోనే ఆమెను బుట్టలో వేసుకున్నాడు. వీరి ఘాడమైన ప్రేమను తెలియజేస్తూ ప్రైవేట్ ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. అధర చుంబనాలతో రెచ్చిపోయిన దారుణమైన పిక్స్ మీడియాలో హల్చల్ చేశాయి.

నయనతార-శింబు పెళ్లి చేసుకోబోతున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. తుస్సుమనిపిస్తూ అనూహ్యంగా బ్రేకప్ చెప్పుకున్నారు. నయనతారకు గుడ్ బై చెప్పాక, హన్సిక లైన్లోకి వచ్చింది. ఈ యంగ్ లేడీ కూడా శింబుతో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయింది. శింబు-హన్సిక సన్నిహితంగా ఉన్న పిక్స్ సైతం సోషల్ మీడియాను ఊపేశాయి. హన్సికతో శింబు లవ్ ఎఫైర్ ఏళ్ల తరబడి సాగింది. తెలుగులో హీరోయిన్ గా పరిచయమై కోలీవుడ్ వెళ్లి హన్సిక అక్కడ సక్సెస్ అయ్యింది. అప్పుడే శింబుకి దగ్గరైంది. ఏమైందో తెలియదు, ఇద్దరూ విడిపోయారు.
తర్వాత ముదురు భామ త్రిష మనసు దోచాడు. నయనతార, హన్సికల ప్రేమతో పోల్చితే త్రిషతో శింబు ప్రేమ కొంచెం పల్చనే. అంత థిక్ కాదు. ఓ రెండు మూడేళ్ళలో పెద్దగా రచ్చ కాకుండా ముగిసింది. పెళ్లి వార్తలైతే వచ్చాయి. అలా అందరికీ తెలిసి శింబు ముగ్గురు ముద్దుగుమ్మలతో అచ్చిక బుచ్చికలు ఆడాడు. శింబు ప్రస్తుత వయసు 40 ఏళ్ళు. పెళ్లి చేసుకోబోయే అమ్మాయి మెడిసిన్ స్టూడెంట్ అంటున్నారు. ఆ లెక్కన ఆమె వయసులో చాలా చిన్న పిల్ల అయ్యుంటుంది కదా!. సెలబ్రిటీ మ్యారేజ్ లలో ఇవన్నీ కామనే. టాలీవుడ్ స్టార్ మహేష్ తనకంటే నాలుగేళ్లు పెద్దదైన నమ్రతను వివాహం చేసుకున్నాడు.