Star hero slapped Jr NTR: నందమూరి ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన హీరోల్లో కొంతమంది మాత్రమే స్టార్ హీరోలుగా నిలదొక్కుకున్నారు. సీనియర్ ఎన్టీఆర్ మొదలు పెట్టిన నట ప్రస్థానాన్ని ఇప్పటికీ కొనసాగిస్తుండటం విశేషం. సీనియర్ ఎన్టీఆర్ విభిన్న తరహా పాత్రలను చేసి తనను మించిన నటుడు ఇండియాలోనే లేరు అనేంతలా పేరు ప్రఖ్యాతాలనైతే సంపాదించుకున్నాడు. ఇక అతని తర్వాత బాలయ్య బాబు మాస్ హీరోగా 50 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీ శాసిస్తున్నాడనే చెప్పాలి. ఇక మూడోవ తరం హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ సైతం ప్రస్తుతం పాన్ ఇండియాలో పెను ప్రభంజనాలను క్రియేట్ చేస్తూ ముందుకు సాగుతున్నాడు… ఇక సీనియర్ ఎన్టీఆర్ కి తమ్ముడిగా ఆయన ప్రతి మూమెంట్ లో ఆయనకు తోడుగా ఉన్న నటుడు మోహన్ బాబు… మొదటి నుంచి కూడా నందమూరి ఫ్యామిలీకి మంచు ఫ్యామిలీ కి మధ్య చాలా మంచి సన్నిహిత సంబంధాలైతే ఉన్నాయి. జూనియర్ ఎన్టీఆర్ చిన్నతనంలో ఉన్నప్పుడే మోహన్ బాబుతో చాలా మంచి పరిచయమైతే ఉండేదట.
ఎన్టీఆర్ ఖాళీ సమయంలో లొకేషన్ కి వెళ్లడం, సినిమా షూటింగులు చూడడం లాంటివి చేసేవాడు. అలాగే మోహన్ బాబు చిన్న కొడుకు అయిన మంచు మనోజ్, జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు ఒకేరోజు పుట్టారు. వీళ్లిద్దరి మధ్య కూడా మంచి ఫ్రెండ్షిప్ ఉంది. ఎన్టీఆర్ తో ఉన్న చనువుతో మోహన్ బాబు జూనియర్ ఏటీఆర్ ను అరేయ్ అని పిలిచేవాడు.
అలాగే చిన్నతనంలో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ఒక విషయంలో మారాం చేయడంతో మోహన్ బాబు తనను కొట్టాడట. మోహన్ బాబు కొట్టడంతో ఎన్టీఆర్ అతని మీద సీరియస్ అయ్యారట. ఇక అదంతా తెలిసి తెలియని టైం కాబట్టి మోహన్ బాబు కూడా లైట్ తీసుకున్నాడట. ఇదంతా సీనియర్ ఎన్టీఆర్ ఇంట్లో పని చేసే ఒక వ్యక్తి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు.
మొత్తానికైతే ఎన్టీఆర్ కి మోహన్ బాబు కి మధ్య చాలా మంచి సన్నిహిత సంబంధాలైతే ఉన్నాయి. ఇప్పటికి వాళ్ళ మధ్య మంచి బాండింగ్ ఉంది. యమదొంగ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ చెప్పడం వల్లే రాజమౌళి మోహన్ బాబుని యముడు పాత్ర కోసం తీసుకున్నాడు… ఇక ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. మోహన్ బాబు సైతం ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు. ఈ సినిమాలో డిఫరెంట్ విలనిజాన్ని ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది…