Rajinikanth Fanboy Kid: సూపర్ స్టార్ రజినీకాంత్ ను కలవాలంటే ఆషామాషి కాదు. ప్రాణంగా ఉండే ఫ్యాన్స్.. ఆ హీరోను కలవడానికి ఎంతో కష్టపడాల్సి వస్తుంది. అలాంటిది ఓ చిన్న పిల్లాడిని ఏకంగా రజనీకాంత్ పిలిపించుకొని.. అతనికి గోల్డ్ చైన్ బహూకరించాడు. అంతేకాకుండా ఆ పిల్లాడి చదువు రెస్పాన్స్ మొత్తం నాదే అని చెప్పాడు. అంతేకాకుండా ఆ పిల్లాడి గురించి తమిళనాడు ప్రభుత్వం ప్రభుత్వ పుస్తకాల్లో పాఠ్యాంశంగా చేర్చింది. ప్రతి తల్లిదండ్రులకు ఇలాంటి పిల్లవాడు ఉంటే.. సమాజం ఎంతో బాగుపడుతుందని కొందరు కొనియాడుతున్నారు. ఇంతకు ఈ పిల్లాడు చేసిన పని ఏంటి? ఇంత చిన్న వయసులోనే అంత గొప్ప గుర్తింపు ఎందుకు పొందగలిగాడు? ఆసక్తికరమైన ఈ స్టోరీ మీకోసం..
Also Read: వార్ 2 సక్సెస్ అయితే ఎన్టీఆర్ ఆ ఫీట్ ను సాధిస్తాడా..?
సాధారణంగా రోడ్డుపై డబ్బులు కనిపిస్తే ఎవరైనా దానిని తీసేసుకుంటారు. వారి అవసరాలకు వాడుకుంటూ ఉంటారు. అయితే 2018 వ సంవత్సరంలో తమిళనాడులో ఓ మారుమూల గ్రామంలో పాఠశాలకు వెళ్తున్న యాసీన్ అనే కుర్రాడికి ఒక బ్యాగ్ కనిపించింది. అందులో రూ. 50,000 ఉన్నాయి. దీన్ని చూసిన యాసిన్.. ఆ బ్యాగును తీసుకెళ్లి తన టీచర్ కు అప్పగించాడు. అయితే ఆ టీచర్ స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్లి బ్యాగును అప్పగించారు. ఈ బ్యాగ్ గురించి తెలుసుకున్న పోలీసులు యాసీన్ ను పోలీస్ స్టేషన్ కు పిలిపించారు. ఈ సందర్భంగా ఆ బాలుడితో.. ఇందులో డబ్బులు ఉన్నాయి కదా.. నీవు ఎందుకు తీసుకోలేదు? అని అడిగారు. దీంతో ఆ బాలుడు.. ఈ డబ్బులు ఎవరో కష్టపడి సంపాదించారు. వారి కష్టార్జితం నాకు వద్దు. నేను సొంతంగా డబ్బులు సంపాదించుకుంటారు.. అని చెప్పాడు.
ఇలా చెప్పడంతో పోలీసులు ఎంతో సంబరపడ్డారు. ఇంత మంచి పని చేసినా బాలుడికి ఏదైనా గిఫ్టు ఇవ్వాలని అనుకున్నారు. దీంతో తనకు ఏం కావాలో అడిగారు. అప్పుడు ఆ బాలుడు సూపర్ స్టార్ రజినీకాంత్ ను ఒకసారి కలవాలని చెప్పాడు. దీంతో పోలీసులు ఆ విషయాన్ని రజనీకాంత్ కు చేరవేశారు. ఈ విషయం తెలుసుకున్న సూపర్ స్టార్ రజనీకాంత్ వెంటనే యాసీన్ ను తన కుటుంబ సభ్యులతో ఇంటికి పిలిపించుకున్నారు. ఆ తర్వాత వారికి మర్యాదలు చేసి.. ఒక గోల్డ్ చైన్ ను గిఫ్ట్ గా ఇచ్చాడు. అంతేకాకుండా యాసిన్ చదువుకు అయ్యే ఖర్చు తానే భరిస్తున్నట్లు రజినీకాంత్ ప్రకటించాడు.
Also Read: ‘వార్ 2’ మూవీ యూఎస్ఏ రివ్యూ
ఈ విషయం తమిళనాడు ప్రభుత్వం మొత్తం తెలియడంతో.. ప్రభుత్వం కూడా స్పందించింది. దీంతో ఇలాంటి విలువలు ఉన్న బాలుడు గురించి పిల్లలకు చెప్పాలని ఉద్దేశంతో.. రెండో తరగతిలో ఒక పాఠ్యాంశంగా ఈ బాలుడి చేసిన పనిని చేర్చింది. అంతేకాకుండా తల్లిదండ్రులు తమ పిల్లలకు డబ్బు, ఆస్తులు ఇవ్వకపోయినా పర్వాలేదు.. కానీ ఇలాంటి విలువలు నేర్పితే సమాజానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని చాలామంది చర్చించుకుంటున్నారు. యాసీన్ లా ప్రతి ఒక్క విద్యార్థి మోరల్ వాల్యూస్ ను కాపాడాలని కోరుతున్నారు.