Devara(6)
Devara: ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ చిత్రం నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలై డివైడ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ, ఓపెనింగ్స్ విషయంలో బ్లాక్ బస్టర్ రేంజ్ లో రాబడుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం చూస్తుంటే ఈ చిత్రం కచ్చితంగా ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబడుతుందని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఎన్టీఆర్ కి ప్రతీ ప్రాంతంలోనూ ఓపెనింగ్ వసూళ్లు రావడం సర్వసాధారణం. కానీ సీడెడ్ ప్రాంతం లో మాత్రం ఎన్టీఆర్ ఓపెనింగ్స్ స్టామినా ఎంతో ప్రత్యేకం. ఆయన కెరీర్ లో దాదాపుగా అన్ని చిత్రాలు ఇక్కడ ఆల్ టైం రికార్డు ఓపెనింగ్స్ ని నమోదు చేసాయి. ఇక ఆరేళ్ళ తర్వాత ఎన్టీఆర్ నుండి వస్తున్న సోలో చిత్రం అయితే సీడెడ్ ఓపెనింగ్స్ ఎలా ఉంటాయో ప్రత్యేకించి చెప్పాలా?.
అయితే అభిమానుల అత్యుత్సాహం కారణంగా అనేక ప్రాంతాలలో కొన్ని అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుంది. నేడు కడప లోని అప్సర థియేటర్ లో అలాంటి ఘటనే నమోదైంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే మస్తాన్ వల్లి అనే ఎన్టీఆర్ వీరాభిమాని నేడు ‘దేవర’ చిత్రాన్ని చూసేందుకు ఎంతో ఉత్సాహంగా థియేటర్ కి వచ్చాడు. తోటి అభిమానులతో కలిసి థియేటర్ బయట చేసిన సంబరాల్లో పాల్గొన్నాడు. ఇక థియేటర్ లోపలకు వెళ్లి సినిమా ప్రారంభం అవ్వగానే అరుపులు కేకలతో మస్తాన్ రెచ్చిపోయాడు. ఇక ఎన్టీఆర్ స్క్రీన్ మీద కనపడగానే గట్టిగా అరుస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే అక్కడ ఉన్న అభిమానులు, థియేటర్ సిబ్బంది మస్తాన్ పరిస్థితిని గమనించి వెంటనే ఆసుపత్రి కి తరలించగా, అప్పటికే ఆయన గుండెపోటుతో మరణించాడని డాక్టర్లు ఖరారు చేసారు. దీంతో మస్తాన్ వల్లి కుటుంబ సభ్యులు ఏడుపులు, ఆర్తనాదాలతో హాస్పిటల్ దద్దరిల్లిపోయింది. అతని కుటుంబ సభ్యులు గుండెలు బాదుకుని ఏడవడం చూసి సమీపం లో ఉన్న జనాలు కన్నీళ్లు పెట్టుకున్నారు. సరదాగా సినిమాకి వెళ్లి ఎంజాయ్ చేయాలని అనుకున్న మస్తాన్ వల్లి కి ఇలాంటి పరిస్థితి రావడం అత్యంత శోచనీయం, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సోషల్ మీడియా లో ఎన్టీఆర్ అభిమానులు మరియు ఇతర హీరోల అభిమానులు ప్రార్థన చేస్తున్నారు.
అంతే కాకుండా మస్తాన్ వల్లి కుటుంబానికి ఏ సహాయం అవసరం వచ్చినా తోడుంటామని వాళ్ళు ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. ఇది ఇలా ఉండగా ఇటీవలే క్యాన్సర్ తో బాధపడుతున్న ఒక అభిమాని, చనిపోయే చివరి స్టేజిలో ఉన్నాను, నేను చనిపోయే లోపు ‘దేవర’ చిత్రం చూడాలని ఉంది అంటూ ఒక వీడియో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ వీడియో తెగ వైరల్ అయ్యి ఎన్టీఆర్ వరకు చేరింది. ఎన్టీఆర్ వెంటనే స్పందించి ఆ అభిమానితో వీడియో కాల్ లో మాట్లాడాడు, ఆ తర్వాత అతనికి ధైర్యం కూడా చెప్పాడు. ఇలాంటి వీరాభిమానులు, ప్రాణాలు ఇచ్చే అభిమానులు మా ఎన్టీఆర్ కి ఉన్నారని సోషల్ మీడియా లో అభిమానులు గర్వంగా చెప్పుకుంటున్నారు.
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
View Author's Full InfoWeb Title: A fan died of a heart attack while watching the movie devara