A big shock to Akhanda 2: సీనియర్ ఎన్టీఆర్ కొడుకుగా ఇండస్ట్రీకి వచ్చిన బాలయ్య మొదట్లో మాస్ సినిమాలు చేసి చాలా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు…ఇక ఇలాంటి సందర్భంలోనే ఇప్పుడు ‘అఖండ 2’ సినిమా తో మరోసారి మరో పెద్ద సక్సెస్ ని సాధించడానికి సిద్ధమయ్యాడు. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇప్పుడు చేయబోతున్న సినిమాలు మరొకెత్తుగా మారబోతున్నాయి. యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తం ఈ సినిమాకోసమే ఎదురుస్తుండటం విశేషం… ఈ సినిమాతో మరోసారి బిగ్గెస్ట్ సక్సెస్ సాధించాలని చూస్తున్నాడు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 5వ తేదీన రిలీజ్ అవ్వనున్న నేపథ్యంలో ఈ సినిమాకి పెద్ద షాక్ తగిలింది…మద్రాస్ హైకోర్టు ఈ సినిమాని రిలీజ్ చేసి నోటీసులు జారీ చేసింది. కారణమేంటి అంటే సినిమా ప్రొడ్యూసర్ అయిన 14 రీల్స్ సంస్థ అధినేతలు రామ్ ఆచంట, గోపి ఆచంట ఇద్దరు మాకు 28 కోట్లు ఇవ్వాల్సి ఉందంటూ ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ మద్రాస్ హైకోర్టు లో పిటిషన్ వేశారు…
మొత్తానికైతే మద్రాస్ హైకోర్టు అఖండ 2 సినిమాని నిలిపివేయాలి అంటూ నోటీసులు జారీ చేయడంతో ఇప్పుడు సినిమా యూనిట్, బాలయ్య అభిమానులు సైతం కొంతవరకు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమా అనుకున్న టైం కు వస్తుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది.
ఎంత గొప్ప విజయాన్ని సాధించిన దానికి మించిన భారీ విజయాన్ని సాధిస్తుందంటూ బాలయ్య బాబు ప్రచారం చేస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఈ సినిమా గొప్ప విజయాన్ని సాధిస్తుందా? డీలా పడిపోతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.
ఇక ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ వేసిన పిటిషన్ ఈ సినిమాకి ఏ అడ్డంకి లేకుండా రేపు రిలీజ్ ఏదో విధంగా జరుగుతుందా? లేదా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది… ఇక సనాతన ధర్మం అనే పాయింట్ ను బేస్ చేసుకొని సినిమా వస్తోంది. కాబట్టి ఈ సినిమాకి ఇండియాలో ఎక్కువ ఆదరణ దక్కుతుందనే చెప్పాలి…