800 Movie Trailer Review: ప్రపంచ మేటి బౌలర్స్ లో మురళీధరన్ ఒకరు. శ్రీలంక దేశానికి చెందిన మురళీధరన్ ప్రపంచ క్రికెట్ హిస్టరీలో అరుదైన మైలురాళ్ళు అందుకున్నాడు. రైట్ హ్యాండ్ ఆఫ్ స్పిన్ బౌలర్ గా మురళీధరన్ మేటి బ్యాట్స్ మెన్ కి చుక్కలు చూపించాడు. ఇక టెస్ట్ క్రికెట్ లో ఎవరూ చేరుకోలేని రికార్డు సొంతం చేసుకున్నారు. అత్యధికంగా 800 ఇంటర్నేషనల్ టెస్ట్ వికెట్స్ పడగొట్టాడు. అందుకే ఆయన బయోపిక్ కి 800 అనే టైటిల్ నిర్ణయించారు. నేడు 800 చిత్ర ట్రైలర్ ని ప్రముఖ క్రికెటర్ సచిన్ విడుదల చేశారు.
దాదాపు మూడు నిమిషాల ట్రైలర్ ఎమోషనల్ గా సాగింది. శ్రీలంక దేశంలో తమిళులు మైనారిటీలు. వివక్షత అణచివేతకు గురయ్యారు. అక్కడ సింహళీయులదే ఆధిపత్యం. విద్యా ఉద్యోగాల్లో వారికే ప్రాతినిధ్యం. అలాంటిది అత్యంత పోటీ ఉండే నేషనల్ క్రికెట్ టీమ్ లో ఒక పేద తమిళుడుకి చోటు దొరుకుతుందా… కానీ మురళీధరన్ తన టాలెంట్ తో అది సాధ్యం చేసి చూపించాడు.
ట్రైలర్ లో చాలా అంశాలు చూపించారు. తమిళుల తిరుబాటు, అణచివేత, పేదవాడైన మురళీధరన్ కెరీర్ లో ఎదిగిన తీరు చూపించారు. అలాగే తన బౌలింగ్ యాక్షన్ పై అభ్యంతరాలు పెట్టడంతో కెరీర్ ప్రమాదంలో పడటం వంటి గడ్డు పరిస్థితులు చెప్పారు. మొత్తంగా మురళీధరన్ బయోపిక్ గా తెరకెక్కుతున్న 800 ట్రైలర్ అద్భుతంగా ఉంది. ఆద్యంతం ఎమోషనల్ గా సాగింది.
మురళీధరన్ రోల్ హిందీ నటుడు మధుర్ మిట్టల్ చేశారు. ఆయన గెటప్ బాగా సెట్ అయ్యింది. ఎంఎస్ శ్రీపతి 800 చిత్రానికి దర్శకత్వం వహించారు. గిబ్రాన్ సంగీతం అందించారు. మురళీధరన్ బయోపిక్ లో విజయ్ సేతుపతి నటించాల్సి ఉంది. ప్రాజెక్ట్ ఫైనల్ అయ్యాక తమిళుల నుండి నిరసన ఎదురైంది. మురళీధరన్ బయోపిక్ చేయకూడదంటూ కొందరు హెచ్చరికలు జారీ చేశారు. దీంతో ఆయన వెనక్కి తగ్గారు.
https://youtu.be/DLN0iI1oRrQ?si=p1Qw58Duxx1rvRoX